మనం చాలా రకాల పెంపుడు జంతువులను పెంచుకుంటాం. కొందరు రహస్యంగా అడవి జంతువులను కూడా పెంచుతున్నట్లు వార్తలు వచ్చాయి. అలా పులులను పెంచిన వారు ఆ జంతువులు తమ యజమాని నుంచి తప్పించుకుని బయటకు వచ్చి చుట్టుపక్కల ప్రజలపై పరాక్రమం చూపడంతో పట్టుబడుతుంటాయి.. అలాంటి వార్తే ఇప్పుడు పాకిస్థాన్ నుంచి ఒకటి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఓ చిరుతపులిని ఇంట్లో రహస్యంగా పెంచుకుంటుంది ఒక కుటుంబం. అయితే, ఒక రోజు ఈ చిరుత ఇంట్లో నుంచి తప్పించుకుని నగరంలోకి ప్రవేశించింది. దాంతో గంటల తరబడి శ్రమించి పులిని పట్టుకున్నారు. పులిని పట్టుకున్నప్పటికీ ఏ ఇంట్లో ఎవరు పెంచారు అన్నది ఇంకా తేలలేదు. యజమానిని గుర్తించి తగిన శిక్ష విధించనున్నట్టు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చిరుతపులి కనిపించింది. ఎవరో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు అధికారుల కళ్లుగప్పిపెంచుతున్న చిరుతపులి తప్పించుకుని వీధిలోకి పారిపోయింది. వీధిలో పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మనుషులను చూసిన తర్వాత పులి పరిస్థితి కూడా అలాగే ఉంది. రద్దీగా ఉండే రోడ్డులో భయంతో పులి అటు ఇటూ పరుగులు తీసింది. వాహనాలనుంచి తప్పించుకుని పరిగెత్తింది.. ఆ తర్వాత చిరుతపులి ఒక గోడ దూకింది. వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Apparently there was a leopard on the loose in DHA Islamabad today… pic.twitter.com/x1y6SGEzVI
— اسریٰ (@freakonomist5) February 16, 2023
పులి నగరంలోకి ప్రవేశించిందని తెలియగానే అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆరు గంటల తర్వాత చిరుతపులిని సురక్షితంగా పట్టుకున్నారు. నగరంలో భయాందోళనలకు గురిచేసిన పులికి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నామని ఇస్లామాబాద్ వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ బోర్డు డైరెక్టర్ తారిక్ బంగాష్ తెలిపారు. అలాగే నలుగురికి గాయాలు తప్ప పెద్ద ప్రమాదాలు ఏమీ జరగలేదని వివరించారు. వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టుగా చెప్పారు. రెండు నుంచి మూడేళ్లలోపు వయసున్న మగపులిని పట్టుకుని నగరంలోని పాత జూకు తరలించినట్లు తారిఖ్ బంగాష్ తెలిపారు. పెంపుడు చిరుతపులి యజమాని ఆచూకీ తెలియలేదని,. అందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు..అదే సమయంలో నగరంలోకి వచ్చిన పులి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..