Perseid meteor shower: ఆకాశంలో అద్భుతం.. అందమైన ఉల్కాపాతం.. ఎప్పుడంటే..

|

Jul 26, 2022 | 10:03 PM

పెర్సీడ్​ ఉల్కాపాతం ఈ ఏడాది అత్యంత అద్భుతంగా కనిపించబోతున్నట్టు చెబుతోంది. ఆ సమయంలో భూమి దట్టమైన, ధూళి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అంటే.. దాదాపు

Perseid meteor shower: ఆకాశంలో అద్భుతం.. అందమైన ఉల్కాపాతం.. ఎప్పుడంటే..
Perseid Meteor Shower
Follow us on

Perseid meteor shower: ఈ విశ్వమే అంతుచిక్కని అద్భుతం. ఎంతసేపు చూసినా తనివితీరని చిత్రం. అలాంటి విశ్వంలో ఆకాశం, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు కొందరు ఔత్సాహకులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. అలాంటి స్కై వాచర్​లకు గుడ్​ న్యూస్​ తీసుకొచ్చింది నాసా. పెర్సీడ్​ ఉల్కాపాతం ఈ ఏడాది అత్యంత అద్భుతంగా కనిపించబోతున్నట్టు చెబుతోంది. ఇది జులై, ఆగస్టు నెలల మధ్య ఏర్పడుతుందని చెబుతున్నారు స్పేస్​ సైంటిస్టులు. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన కాస్మిక్ లైట్ షోగా ఇది ఉంటుందని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం భూమి జులై 17 నుంచి ఆగస్టు 24 తేదీల మధ్య కామెట్​ స్విఫ్ట్​ టటిల్​ (Comet Swift-Tuttle ) మార్గంలో వెళ్తుంది.

ఆ సమయంలో భూమి దట్టమైన, ధూళి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అంటే.. దాదాపు ఆగస్టు 11, 12 తేదీల వరకు ఇట్లాంటి పెర్సీడ్​ ఉల్కాపాతం కనిపించే అవకాశాలున్నాయి. అయితే.. అమెరికన్ మెటోర్ సొసైటీ (AMS) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఆగస్ట్ 11-12 తేదీల్లో అత్యధిక సంఖ్యలో ఉల్కలను చూసే అవకాశం అమెరికన్ ప్రజలకు దక్కబోతున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి