Imran Khan: ఫోన్ కాల్ కోసం 8 నెలలుగా ఎదురుచూపులు.. అమెరికా అధ్యక్షుడిపై పాక్ ప్రధాని అసహనం

|

Sep 16, 2021 | 5:31 PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ స్థానంలో జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టి ఎనిమిది మాసాలు గడిచాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలు దేశాధినేతలతో మర్యాదపూర్వకంగా ఫోన్‌లో మాట్లాడారు. 

Imran Khan: ఫోన్ కాల్ కోసం 8 నెలలుగా ఎదురుచూపులు.. అమెరికా అధ్యక్షుడిపై పాక్ ప్రధాని అసహనం
Imran Khan
Follow us on

డొనాల్డ్ ట్రంప్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టి ఎనిమిది మాసాలు గడిచాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలు దేశాధినేతలతో మర్యాదపూర్వకంగా ఫోన్‌లో మాట్లాడారు.  అందరితో పాటు తనకు కూడా బైడెన్ నుంచి మర్యాదపూర్వకంగా ఫోన్ కాల్ వస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూశారు. కనీసం ఆఫ్గనిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల తర్వాతనైనా తనకు బైడెన్ నుంచి ఫోన్ కాల్ వస్తుందని ఇమ్రాన్ ఆశించారు. అయితే వైట్ హౌస్ నుంచి తనకు ఫోన్ కాల్ ఏదీ రాకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ అసహనం చెందుతున్నారు. బైడెన్ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంపై సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆయన బిజీ మ్యాన్ (He is a busy man) అంటూ ఇమ్రాన్ అసహనం వ్యక్తంచేశారు. తనకు ఎందుకు ఫోన్ కాల్ చేయలేదో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌నే అడగాలని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో అమెరికాతో తమ సంబంధాలు ఒక్క ఫోన్ కాల్‌తో ముడిపడిలేదంటూ తనను తాను ఓదార్చుకునేందుకు ప్రయత్నించారు. అమెరికాతో బహుముఖ సంబంధాలను తాము కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఆఫ్గనిస్థాన్ విషయంలో తాము అద్దె తుపాకీలమన్న ఇమ్రాన్ ఖాన్.. అమెరికా ఆఫ్గన్‌లో చేసిన యుద్ధంలో విజయం సాధించాలని ఆశించినట్లు చెప్పారు. మిలిటరీ బలంతో ఆఫ్గనిస్థాన్‌లో అనుకున్నది సాధించలేమని అమెరికాకు ముందే చెప్పామని వ్యాఖ్యానించారు. తాలిబన్లతో రాజకీయ పరిష్కారం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

Also Read..

సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ.. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌‌లకు ఆహ్వానం.

Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ..