Pakistan PM Imran: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇతర దేశాలు ఇచ్చిన బహుమతులను అమ్ముతున్నరంటూ ఆ దేశంలోని ప్రతిపక్ష నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని ఇమ్రాన్ తీసుకుంటున్న కొన్ని చర్యలు తమ దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉంటున్నాంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇతర దేశాల నుంచి అందుకున్న ఓ విలువైన బహుమతిని తన సన్నిహితుడి ద్వారా అమ్మించిన ఆ డబ్బులను తన సొంత ఖాతాలో జమ చేసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ బహుమతిని రూ. 7.4 కోట్లకు అమ్మారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సర్వసాధారణంగా ఒక దేశం మరొక దేశానికి బహుమతులు ఇస్తే.. గిఫ్ట్ డిపాజిటరీ (తోషాఖానా) నిబంధనల ప్రకారం వాటిని బహిరంగ వేలంలో విక్రయించాలి. లేదంటే అటువంటి బహుమతులను దేశానికి చెందిన ఆస్తిగా భావిస్తారు. ఇమ్రాన్ ఖాన్‌కు గల్ఫ్ దేశాలకు చెందిన యువరాజు 1 మిలియన్ డాలర్ల విలువైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడని దానిని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు దుబాయ్‌లో అమ్మేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గిప్ట్ ఇచ్చిన యువరాజుకు కూడా తెలుసంటూ ప్రచారం సాగుతుంది.
ఇతర దేశాల నుంచి అటువంటి గిఫ్ట్స్ ను అందుకున్న ‘ఇమ్రాన్ ఖాన్ వాటిని విక్రయించారని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) ఉపాధ్యక్షురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ట్వీట్ చేశారు. గిఫ్ట్ డిపాజిటరీ నుంచి విదేశీ బహుమతులను దోచుకుంటున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పంజాబ్ అధ్యక్షుడు రాణా సనావుల్లా ఇతర దేశాల అధిపతుల అందుకున్న బహుమతులను విక్రయించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పరువు తీశారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Also Read: రంగు రంగు దుస్తులను ధరించినట్లు కనిపించే కోతి.. ప్రత్యేకతలు ఏమిటంటే..