Pakistan: పాకిస్థాన్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుపై ఏకంగా రూ.100..

|

Apr 15, 2022 | 11:40 AM

Pakistan Fuel Prices: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ధరాఘాతంతో ప్రజలు కుదేలవుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కొత్త ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.

Pakistan: పాకిస్థాన్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుపై ఏకంగా రూ.100..
Petrol, Diesel Price
Image Credit source: TV9 Telugu
Follow us on

Pakistan Fuel Prices: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ధరాఘాతంతో ప్రజలు కుదేలవుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కొత్త ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలపై భారీ పెట్రో ధరల భారాన్ని మోపేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్న వార్త పాకిస్థాన్ మీడియా వర్గాల్లో చక్కర్లుకొడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై ఏకంగా రూ.100ల మేర పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. దీంతో నిత్యవసర సరకుల ధరలు మరింత పెరిగి ప్రజలపై మరింత భారం పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ దిగజారడంతో ఇంధన ధరలను భారీగా పెంచాల్సిన అవసరముందని పాకిస్థాన్‌లోని ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ(OGRA) ప్రతిపాదించింది. లీటరు డీజిల్‌పై రూ.83.5, లీటరు పెట్రోల్‌పై రూ.119లు పెంచేందుకు పెట్రోలియం శాఖ ఆమోదం కోరింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్‌, డీజిల్ పై 17 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా.. దీన్ని 70 శాతానికి పెంచాలని ఓజీఆర్ఏ కోరుతోంది. లైట్ డీజిల్, కిరోసిన్ తదితర ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సైతం భారీగా పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

ఓజీఆర్ఏ ప్రతిపాదలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సంప్రదింపుల అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. పెట్రో ధరల పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.200ల ఎగువునకు చేరనున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ అసమర్థత కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపణలు గుప్తించారు. దీంతో ధరాఘాతం నుంచి తమకు ఊరట కలిగించే నిర్ణయాలను కొత్త ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలు ఆశించారు. దీనికి భిన్నంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

Also Read..

Migraine Relief Tips: ఈ ఐదు యోగాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి

Telangana: వ్యవసాయానికి విద్యుత్ ఏడు గంటలు మాత్రమే.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం