Fire Accident: కరాచీలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం, 9 మంది మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

|

Nov 25, 2023 | 3:30 PM

పాకిస్థాన్‌లోని కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లో ఉన్న RJ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం తొమ్మిది మంది మరణించా. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తొమ్మిది మృతదేహాలను ఆసుపత్రులకు తీసుకువచ్చినట్లు కరాచీలోని స్థానిక అధికారులు తెలిపారు.

Fire Accident: కరాచీలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం, 9 మంది మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
Karachi Fire Accident
Follow us on

పాకిస్థాన్‌లోని కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లో ఉన్న RJ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం తొమ్మిది మంది మరణించా. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తొమ్మిది మృతదేహాలను ఆసుపత్రులకు తీసుకువచ్చినట్లు కరాచీలోని స్థానిక అధికారులు తెలిపారు. ఎనిమిది మృతదేహాలను జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ JPMC, ఒకరిని సివిల్ హాస్పిటల్ కరాచీకి తీసుకువచ్చారు. గాయపడిన 18 ఏళ్ల బాలికను కరాచీలోని సివిల్ హాస్పిటల్‌లో చేర్పించడంతో ఆమె మరణించింద అధికారులు చెప్పారు.

ఈ మొత్తం ఘటనకు సంబంధించిన నివేదికను కరాచీ ముఖ్యమంత్రికి కూడా సమర్పించారు. అగ్నిప్రమాదం తర్వాత మాల్ నుండి 22 మందిని రక్షించి జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ JPMCకి తరలించారు. వారిలో ఒకరు మార్గమధ్యంలో మరణించారని జిల్లా డిప్యూటీ కమిషనర్ అల్తాఫ్ షేక్ తెలిపారు. తూ భవనాన్ని నాలుగో అంతస్థు వరకు ఖాళీ చేయగా, ఐదు, ఆరో అంతస్తులను ఖాళీ చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు.

ఉదయం 6:30 గంటలకు షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన భవనం పెద్ద వాణిజ్య భవనమని షరియా ఫైసల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజా తారిక్ మెహమూద్ డాన్ మీడియాతో చెప్పారు. భవనం లోపల షాపింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, సాఫ్ట్‌వేర్ హౌస్‌లు ఉన్నాయి. ఉదయం 6:30 గంటలకు సంఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఆ తర్వాత వారు 8 ఫైర్ టెండర్లు, రెండు స్నార్కెల్స్, రెండు బౌజర్లను సంఘటనా స్థలానికి పంపించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక, రెస్క్యూ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నిమాపక దళం అక్కడికి చేరుకునేలా రోడ్డును క్లియర్ చేయాలని కూడా ఆయన ఆదేశించారు. అయితే కరాచీలోని 90 శాతం భవనాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానిక మీడియా పేర్కొంది.

ఈ ఘటనపై సింధ్ తాత్కాలిక ముఖ్యమంత్రి మక్బూల్ బకర్ దృష్టి సారించి క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వారం ప్రారంభంలో, ప్రభుత్వ ఇంజనీర్లు నగరంలోని భవనాలను పరిశీలించారు. ఇందులో నగరంలోని దాదాపు 90 శాతం భవనాలలో అగ్నిప్రమాదాల నుండి తప్పించుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు లేవని తేలింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..