Viral: మంచు వరదలో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

|

May 12, 2022 | 6:30 AM

Viral: గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి.

Viral: మంచు వరదలో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!
Bridge
Follow us on

Viral: గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యక్ష సాక్షమే ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు..

పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్‌లో జరిగింది ఈ షాకింగ్‌ ఘటన. మే 7 శనివారం రోజున మౌంట్ షిప్పర్‌ ప్రాంతంలో గల గ్లేసియర్ నదం కరిగిపోయి వరద పోటెత్తింది. వరద దాటికి కారకోరం అంతర్జాతీయ రహదారిపై ఉన్న హసన్‌బాద్ వంతెన కూలిపోయింది. ఈ వీడియోను పాకిస్తాన్ పర్యావరణ మంత్రి షెర్రీ రెహ్మాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వరద వల్ల పిల్లర్ల కింద ఉన్న మట్టి కొట్టుకుపోయి వంతెన కూలిపోయిందని నిర్ధారించినట్లుగా ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. . మరో రెండు రోజుల్లో తాత్కాలిక వంతెనను నిర్మిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి