Pakistan-Yasin Malik: వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్ కోసం అంతర్జాతీయ కోర్టుకు.. పాక్ మరో కుళ్లు రాజకీయం..

|

May 25, 2022 | 7:24 PM

కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌ను అన్ని కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని పాక్​ విదేశాంగ మంత్రి బిలావల్​ భుట్టో జర్దారీ డిమాండ్ చేశారు. అతడ్ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని తద్వారా కుటుంబాన్ని కలిసేలా చూడాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల

Pakistan-Yasin Malik: వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్ కోసం అంతర్జాతీయ కోర్టుకు.. పాక్ మరో కుళ్లు రాజకీయం..
Pakistan Foreign Minister B
Follow us on

పాకిస్తాన్ తన దొంగ బుద్దిని మరోసారి బయటపెట్టుకుంది. కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌ను అన్ని కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని పాక్​ విదేశాంగ మంత్రి బిలావల్​ భుట్టో జర్దారీ డిమాండ్ చేశారు. అతడ్ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని తద్వారా కుటుంబాన్ని కలిసేలా చూడాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్​ మిషెల్​ బాచెలేకు ఆయన లేఖ రాశారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మే 24న బాచెలేకు లేఖ పంపినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. “కశ్మీరీలను అణచివేసి.. వారిని ప్రేరేపిత కేసుల్లో ఇరికించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లేఖలో వివరించాము” అని చెప్పింది.

ముఖ్యంగా యాసిన్​ మాలిక్ పట్ల వ్యవహరించిన తీరును తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కౌన్సిల్‌ను భుట్టో లేఖలో కోరారు.పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ఓఐసీ(ఇస్లామిక్​ సహకార సంస్థ) సెక్రటరీ జనరల్ హిస్సేన్ బ్రహింతాకు కూడా లేఖ రాశారు.

కశ్మీర్‌లో పరిస్థితుల గురించి ఆయనకు వివరించారు. జమ్ముకశ్మీర్.. తమ దేశంలో అంతర్భాగమని భారత్ ఇప్పటికే పలుమార్లు పాకిస్థాన్‌కు చెప్పింది. వాస్తవాన్ని తెలుసుకుని, భారత్​పై వ్యతిరేక ప్రచారాలన్నింటినీ ఆపాలని పాకిస్థాన్‌కు సూచించింది. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో సాధారణ పొరుగు దేశ సంబంధాలను కోరుకుంటున్నట్లు కూడా తెలిపింది.