Earthquakes: 2 వారాల్లో 900 సార్లు కంపించిన భూమి.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?

ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు గత రెండు వారాలుగా భయంతో వణిపోతున్నారు. నిద్రహారాలు, తిండితిప్పలు వదిలి ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఇంతకు వాళ్లు అంతలా ఎందుకు భయపడుతున్నారు. అసలు ఇదంతా జరిగేది ఎక్కడ అనుకుంటున్నారా.. అయితే తెలుసుకుందాం పదండి.

Earthquakes: 2 వారాల్లో 900 సార్లు కంపించిన భూమి.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?
Earthquakes

Updated on: Jul 03, 2025 | 1:42 PM

జ‌పాన్‌లోని టోకారా దీవుల్లో రికార్డు స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు సంభవిస్తున్నాయి. గ‌త రెండు వారాల్లోనే ఆ దీవుల్లో సుమారు 900 సార్లు భూమి కంపించడం స్థానికంగా నివసిస్తున్న ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో స్థానిక ప్రజలు గత రెండు వారాలుగా తిండితిప్పలు, నిద్రహారాలు మానేసి ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంభయంగా జీవనం గడుపుతున్నారు. రాత్రి పడుకుంటే ఎప్పుడు ఏ గోడ కూలి మీద పడుతుందోనని నిద్రపోవడమే మానేశారు. గత నెల 21వ తేదీ నుంచి జపాన్‌లోని టోకారా దీవుల్లో సెసిమిక్ యాక్టివిటీ పెరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా బుధ‌వారం మరోసారి టోకారా దీవుల్లో 5.5 తీవ్ర‌త‌తో భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే ఈ భూకంప వల్ల స్థానికంగా ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదని అధికారులు చెబుతున్నారు.

అయితే గత రెండు వారాలుగా టోకారో దీవుల్లో భూ ప్ర‌కంప‌న‌లు ఎక్కువ కావ‌డం వ‌ల్ల నిద్రపోవాలంటేనే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ప్రజలు అవసరమైతే భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లవచ్చని స్పష్టం చేసింది.

అయితే ప‌సిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రేఖాంశంలో ఉన్న జ‌పాన్‌లో సాధార‌ణంగానే భూకంపాలు ఎక్కవగా వ‌స్తుంటాయి. జపాన్‌లో ప్ర‌తి ఏడాదికి సగటునా 1500 వరకు భూ ప్ర‌కంప‌న‌లు సంభవిస్తుంటాయి. కాగా ప్రస్తుతం రికార్డు స్థాయిలో భూ ప్రకంపనలు సంభవిస్తున్న టొకారాలో 12 దీవులు ఉన్నాయి. వాటిల్లో సుమారు 700 మందికిపై జనాలు జీవిస్తున్నారు. అయితే ఈ దీవుల్లో ఎలాంటి హాస్పిటల్‌ సదుపాయాలు లేవు. అత్యవసరం అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర దీవులకు వెళ్లాల్సిందే. అందుకే ప్రజలలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చిరించినట్టు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.