Fake Vaccine: నకిలీ కరోనా వ్యాక్సిన్ల సరఫరా.. 80 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. 3వేల నకిలీ టీకాల స్వాధీనం

|

Feb 03, 2021 | 12:51 PM

Fake Vaccine: ఏదైనా మంచి చేయాలంటే సమయం పడుతుంది కానీ.. చేయాలంటే ఎక్కువ సమయం పట్టదు. మార్కెట్లోకి ఏదైనా వస్తువు వచ్చిందంటే చాలు.. అది పూర్తి స్థాయిలో ...

Fake Vaccine: నకిలీ కరోనా వ్యాక్సిన్ల సరఫరా.. 80 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. 3వేల నకిలీ టీకాల స్వాధీనం
COVID-19 vaccines price
Follow us on

Fake Vaccine: ఏదైనా మంచి చేయాలంటే సమయం పడుతుంది కానీ.. చేయాలంటే ఎక్కువ సమయం పట్టదు. మార్కెట్లోకి ఏదైనా వస్తువు వచ్చిందంటే చాలు.. అది పూర్తి స్థాయిలో రాకముందే నకిలీ వస్తువులు అధిక సంఖ్యలో వస్తుంటాయి. ఇక కరోనా మహమ్మారి గత ఏడాదిగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ విరుగుడుకు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేశారు. తాజాగా కరోనా వ్యాక్సిన్‌ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో నకిలీ కరోనా వ్యాక్సిన్లు బయట పడటం సంచలనం సృష్టిస్తోంది. చైనాలో నకిలీ కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నకిలీ టీకాలు ఇప్పటికే ఆఫ్రికా చేరినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన నేరాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 80 మందిని అరెస్టు చేశారని, 3వేల మోతాదుల నకిలీ టీకాలను స్వాధీనం చేసుకున్నారని చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

బీజింగ్‌, జియాంగ్‌, శాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లలో పోలీసులు ఈ దాడులు చేశారు. గత సెప్టెంబర్‌ నుంచి నకిలీ టీకాలు తయారు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ ఆఫ్రికాకు రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా నకిలీ వ్యాక్సిన్లను అక్రమంగా ఆఫ్రికాకు రవాణా చేసినట్లు వెల్లడించారు. అయితే వాటిని ఎలా దేశం దాటించారనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: Second Dose of Vaccine: ఈ నెల 15 నుంచి వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్.. తెలంగాణాలో ‌5 వరకే హెల్త్‌ కేర్‌ వర్కర్లకు టీకాలు..