
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఇంట్లో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. నవంబర్ 9 ఆదివారం నాడు లోయర్ దిర్‌లోని మాయర్‌లోని నసీమ్ షా ఇంటి ప్రధాన గేటుపై కాల్పులు జరిగాయి. ప్రధాన గేటు, కిటికీ, పార్క్ చేసిన కారు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ వార్తా సంస్థ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం, “పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ప్రధాన ద్వారం, కిటికీ, అక్కడ నిలిపి ఉంచిన కారుపై బుల్లెట్లు పేలాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మాయర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.” అని పేర్కొంది. వీడియోలో, బుల్లెట్ల ప్రభావంతో ఇనుప ప్రధాన గేటులో అనేక రంధ్రాలు పడ్డాయని, సమీపంలో పార్క్ చేసిన నల్లటి కారు పైకప్పు దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చిన ఒక వార్త ప్రకారం, పోలీసులు వచ్చే సమయానికి, దాడి చేసినవారు అక్కడి నుండి పారిపోయారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని త్వరలోనే వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు షా ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకరు. నసీమ్ షా 2019లో పాకిస్తాన్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
వీడియో ఇక్కడ చూడండి..
Militants opened fire at the house of the national cricket team fast bowler @iNaseemShah in Lower Dir. The firing has damaged the main gate, windows, and a vehicle partially. However, Police reached the scene immediately, but the attackers managed to escape. pic.twitter.com/jgLVfatBi4
— Jawad Yousafzai (@JawadYousufxai) November 10, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..