Viral Video: రైలు పట్టాలపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్‌… ఢీ కొట్టిన ట్రైన్.. వీడియో వైరల్‌

Plane Crash: అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పైలట్‌ చిన్ని విమానాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇంతలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌..

Viral Video: రైలు పట్టాలపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్‌... ఢీ కొట్టిన ట్రైన్.. వీడియో వైరల్‌
Plan Crash

Edited By: Janardhan Veluru

Updated on: Jan 11, 2022 | 6:07 PM

Plane Crash: అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పైలట్‌ చిన్ని విమానాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇంతలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశాడు. అయితే అతను తప్పని పరిస్థితిలో సరిగ్గా రైలు, రోడ్డు క్రాస్‌ అయ్యే చోట విమానం ల్యాండ్‌ చేశాడు. అయితే  విమానం సరిగ్గా ల్యాండ్‌ అవకపోవడంతో పైలట్‌ విమానంనుంచి బయటకు రాలేకపోయాడు. ఇది గమనించిన ఇద్దరు ఫుట్‌హిల్ డివిజన్ ఆఫీసర్లు వేగంగా అతని దగ్గరకు పరుగెత్తుకు వెళ్లారు. విమానంలో ఇరుక్కున్న అతన్ని అతి కష్టంమీద బయటకు తీసి… మోసుకుంటూ వేగంగా పరుగెత్తారు.. సరిగ్గా అదే టైమ్‌లో వాయువేగంతో వచ్చిన రైలు విమానాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఆ ఆఫీసర్లు అంత వేగంగా స్పందించకపోయి ఉంటే… ఆ పైలట్ ప్రాణాలు పోయేవే. అందుకే నెటిజన్లు రియల్ హీరోలంటూ వాళ్లను మెచ్చుకుంటున్నారు. వాళ్ల బాడీక్యామ్‌లో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియోని ట్విట్టర్‌ అకౌంట్‌లో జనవరి 10న పోస్ట్ చెయ్యగా… కొన్ని గంటల్లోనే దీన్ని మిలియన్ల మంది వీక్షించారు. నిజంగా ఆ ఆఫీసర్ల స్పందనను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే… వాళ్లు ఆలస్యం చేసి ఉంటే… పైలట్‌తోపాటూ… వాళ్లనూ రైలు ఢీకొట్టేదే. ఆ విమానాన్ని రైలు ఢీకొట్టినప్పుడు దాని భాగాలు ఎంతో వేంగంతో చెల్లా చెదురయ్యాయి. అవి గుచ్చుకున్నా ప్రాణాపాయమే. అలాంటిదేదీ జరగకుండా కాపాడారు. ప్రస్తుతం ఆ పైలట్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

పైలట్‌ను కాపాడిన ఇద్దరు వ్యక్తులు.. వైరల్ వీడియో..

Also Read:   శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. సుగంధం ద్రవ్యాలతో ఆలయాన్ని శుభ్రం చేసిన అర్చకులు..