
ప్రసిద్ధ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ 2025లో సంభవించే పలు సంఘటన గురించి ఆయన పుస్తకాల్లో ప్రస్తావించారు. ఆయన రచనల్లో కొన్ని వివాదాస్పదం అయినప్పటికీ.. 2025కు సంబంధించి ఆయన చెప్పిన జోస్యంపై చాలా మంది నమ్మకం చూపిస్తున్నారు. అందుకు కారణం తాజాగా మరో కొత్త వైరస్ బయటపడటమే. చైనాలో శాస్త్రవేత్తలు కొత్త రకం వైరస్‌ను కనిపెట్టారు. కరోనా వైరస్ సంతతికి చెందిన ఈ వైరస్ కూడా గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని అంటున్నారు. అంటే కోవిడ్ ప్యాండమిక్ లాంటి మరో ప్యాండమిక్‌ను ఈ ఏడాది ప్రపంచ చూడనుందా అనే భయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
మరి ఇంతకీ నోస్ట్రాడమస్ తన రచనల్లో 2025 గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.. 16వ శతాబ్దానికి చెందిన నోస్ట్రాడమస్ రచనలు చాలా వరకు నెపోలియన్ ఆరోహణ, ప్రపంచ యుద్ధాలు, సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి, చారిత్రక సంఘటనలో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సంఘర్ఘణలు, శాస్త్రీయ, వైద్య పురోగతులు వంటివి ఉన్నాయి. ఇక 2025 ఏడాది విషయానికి వస్తే.. నోస్ట్రాడమస్ చెప్పినట్లు ఈ ఏడాదిలో భూకంపాలు, వరదల గురించి ప్రస్తావించారు. రాబోయే పర్యవరణ విపత్తులకు ఇవి సంకేతలని పేర్కొన్నారు. ఆయన చెప్పినట్లే ధ్రువ మంచు కప్పులు కరగడం, పెరుగుతున్న గ్లోబుల్ వార్మింగ్ వంటివి ఆయన చెప్పిన దానికి సరిపోతున్నాయి. వీటి కారణంగా వరదలు, కరువులు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తులు ఏడాది సంభవించే అవకాశం ఉందని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు.
ఇక నోస్ట్రాడమస్ చెప్పిన మరో విపత్తు గ్రహశకలంతో ముప్పు. 2025లో స్ట్రీట్ మెసేంజర్ అనే గ్రహశకలంతో విపత్తు పొంచి ఉంటుందని ఆయన అప్పుడే ఊహించాడు. దానికి తాజాగా నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టిన 2024 వైఆర్4 గ్రహశకలాన్ని జోడించవచ్చు. ఈ వైఆర్4 అనే గ్రహశకలం భూమిని ఢీ కొనేందుకు దూసుకొస్తుందని నాసా సైంటిస్టులు వెల్లడించారు. అలాగే యూరప్‌లో యుద్ధాల గురించి కూడా నోస్ట్రాడమస్ ప్రస్తావించారు. ప్రస్తుత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా దానికి జోడించవచ్చు. అలాగే వైద్య, సాంకేతిక రంగాల్లో కూడా మార్పుల గురించి ఆయన ప్రస్తావించినట్లు ఆయన పుస్తకాల్లో ఉంది. సైబర్ నేరాలు, ఏఐల వంటివి వస్తాయని ఆయన రచనలు డీ కోడ్ చేస్తే తెలుస్తుందని కొన్ని కథనాలు అంతర్జాతీయ మీడియాల్లో వస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.