నార్వేలో ఫైజర్ వ్యాక్సిన్ వికటించి 23 మంది వృధ్ధుల మృతి, మరో 23 మందికి తీవ్ర అస్వస్థత, విచారణకు ప్రభుత్వ ఆదేశం

నార్వేలో ఫైజర్, బయో ఎన్ వ్యాక్సిన్ తీసుకున్న వృధ్ధుల్లో 23 మంది మరణించగా, మరో 23 మంది తీవ్ర అస్వస్థత పాలయ్యారు.

  • Umakanth Rao
  • Publish Date - 10:54 am, Sat, 16 January 21
నార్వేలో ఫైజర్ వ్యాక్సిన్ వికటించి 23 మంది వృధ్ధుల మృతి, మరో 23 మందికి తీవ్ర అస్వస్థత, విచారణకు ప్రభుత్వ ఆదేశం

నార్వేలో ఫైజర్, బయో ఎన్ వ్యాక్సిన్ తీసుకున్న వృధ్ధుల్లో 23 మంది మరణించగా, మరో 23 మంది తీవ్ర అస్వస్థత పాలయ్యారు. 80 ఏళ్లకు పైబడిన వృధ్ధుల్లో ఈ మరణాలు ఎక్కువగా సంభవించాయని డాక్టర్లు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. వయస్సు మరీ మీద పడినవారు, ఈ టీకామందు తీసుకోకపోవడమే మంచిదని నార్వేజియన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్  హెల్త్ ప్రకటించింది. డాక్టర్లు కూడా ఈ విషయమై ప్రజలను హెచ్చరించాలని సూచించింది. దేశంలో ఇప్పటివరకు ఫైజర్ లేదా మోడెర్నా వ్యాక్సిన్ ని 30 వేలమందికి పైగా తీసుకున్నారు. నార్వే కోవిడ్ మరణాల నేపథ్యంలో యూరప్ కు తమ టీకామందు సరఫరాను తగ్గిస్తామని ఫైజర్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్న సంస్థ ప్రకటించింది. అటు ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 21 మంది మహిళలు, 8 మంది పురుషులు సైడ్ ఎఫెక్ట్స్ కి గురయ్యారు.

తమ వ్యాక్సిన్ విషయంలో ఆయా పబ్లిక్ హెల్త్ సంస్థలు ఆయా ప్రొటొకాల్స్ పాటించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థ కోరుతోంది. ముఖ్యంగా 80 ఏళ్ళు పైబడిన వృధ్ధుల్లో ఇతర శారీరక జబ్బులు, రుగ్మతలు కూడా ఉండవచ్ఛునని, బహుశా అవి కూడా వారి మరణానికి దారి తీసి ఉండవచ్ఛునని ఈ సంస్థ పేర్కొంది.

 

Also Read:

Worldwide Coronavirus Updates:  ప్రపంచదేశాల్లో మరణమృదంగం మోగిస్తున్న కరోనా.. 20 లక్షలు దాటిన మరణాలు

Bhuma Akhila Priya: బెయిల్ పిటిషన్ పై నేడు సికింద్రాబాద్ కోర్టు విచారణ

మొదటి విడత వ్యాక్సిన్ ఎవరెవరికి ఇస్తారు ? ఎన్ని కోట్లమందికి ? మరికొన్ని గంటల్లో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం