ఐదేళ్ల వయసులోనే కిమ్‌ పడవ నడిపేవాడట

| Edited By:

Sep 20, 2020 | 11:39 AM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై భవిష్యత్ తరాల నుంచి కూడా వ్యతిరేకత రాకూడదని ప్రణాళికలు సిద్ధం చేశారు

ఐదేళ్ల వయసులోనే కిమ్‌ పడవ నడిపేవాడట
Follow us on

Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై భవిష్యత్ తరాల నుంచి కూడా వ్యతిరేకత రాకూడదని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ప్రీస్కూల్‌లో విద్యార్థుల సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. అక్కడి పిల్లలు రోజుకు 90 నిమిషాల పాటు దేశాధినేత గురించి తెలుసుకునేందుకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ మేరకు కిమ్‌ సోదరి కిమ్‌ యో జాంగ్ ఆదేశాలు జారీ చేశారు.

డెయిలీ ఎన్‌కే మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదు నుంచి ఆరు సంవత్సరాలున్న ప్రిస్కూల్ విద్యార్థులు రోజుకు గంటన్నర పాటు కిమ్ వంశస్తుల బాల్యం గురించి తెలుసుకోవాలి. అందులో గంటసేపు ఈ నేతల గురించి తెలుసుకోవడంతో పాటు నేతల బాల్యం నుంచి విప్లవాత్మక సంగీతాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ పాఠ్యాంశంలో కిమ్‌ ఐదేళ్ల వయసున్నప్పుడే పడవ నడిపేవారని, చదవడాన్ని ఇష్టపడేవారని, లక్ష్యసాధనలో నిమగ్నమయ్యేవారని అక్కడి పిల్లలకు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రిస్కూల్ పిల్లలను మామూలుగా ఉదయం 9 నుంచి 12గంటల వరకు గదిలో కూర్చోబెట్టడమే కష్టం. ఇక ఇప్పుడు మరో గంటన్నర సేపు పిల్లలను ఎలా కూర్చోబెట్టాలో అర్ధం అవ్వక అక్కడి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.

Read More:

2024 నాటికి ఏపీ మద్య రహిత రాష్ట్రంగా మారుతుంది

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,137 కొత్త కేసులు.. 8 మరణాలు