North Korea: వారంలో రెండు క్షిపణులు.. త్వరలో అణ్వాయుధ పరీక్షకు సిద్ధం.. ప్రపంచానికి ముప్పుగా ఉత్తర కొరియా చేష్టలు!

|

May 07, 2022 | 1:06 PM

ఉత్తర కొరియా శనివారం ఒక గుర్తుతెలియని క్షిపణిని తూర్పు సముద్రాల వైపు ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. ఈ వారంలో ఉత్తర కొరియాకు ఇది రెండవ పరీక్ష.

North Korea: వారంలో రెండు క్షిపణులు.. త్వరలో అణ్వాయుధ పరీక్షకు సిద్ధం.. ప్రపంచానికి ముప్పుగా ఉత్తర కొరియా చేష్టలు!
Kim Jong Un
Follow us on

North Korea may test Nuclear Weapon: ఉత్తర కొరియా శనివారం ఒక గుర్తుతెలియని క్షిపణిని తూర్పు సముద్రాల వైపు ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. ఈ వారంలో ఉత్తర కొరియాకు ఇది రెండవ పరీక్ష. అయితే రాబోయే నెల రోజుల్లో అణు పరీక్షను నిర్వహించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోందన్న అనుమానాలను వ్యక్తం చేసింది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క్షిపణి బాలిస్టిక్ క్షిపణియేనా, అది ఎంత దూరంలో పడిపోయింది అనేది ఇంకా స్పష్ఠం తెలియదు. కానీ మూడు రోజుల ముందు, ఉత్తర కొరియా బుధవారం దాని రాజధాని ప్యోంగ్యాంగ్ నుండి అనుమానాస్పద బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా, జపాన్ సైన్యాలు తెలిపాయి.

ఈ తాజా పరీక్ష ఈ ఏడాది ఉత్తర కొరియా 15వ క్షిపణి పరీక్ష. ఉత్తర కొరియా అణు పరీక్షా స్థలంలో సొరంగాలను పునరుద్ధరిస్తోందని, ఇది అణ్వాయుధాలను పరీక్షించవచ్చనే భయాన్ని పెంచుతోంది. ఉత్తర కొరియా చేస్తున్న ఈ చేష్టల కారణంగా దాని పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ తమ భద్రత గురించి చాలా ఆందోళన చెందుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఈ దేశాలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. ఉత్తర కొరియా ఆయుధాలను పరీక్షించడం ద్వారా అమెరికా, ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా ఆంక్షలు ఎత్తివేయకుండా చూడాలని చూస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

మూడు రోజుల ముందు, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా అణ్వాయుధాలు లేని ప్రపంచం ఆవశ్యకత గురించి చర్చించడానికి రోమన్ క్యాథలిక్ చర్చి అగ్ర మతగురువు పోప్ ఫ్రాన్సిస్, వాటికన్ అధికారులను కలిశారు. వాటికన్ బుధవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై అణ్వాయుధ రష్యా దాడి, తూర్పు జలాల్లో బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించి తన స్వంత అణ్వాయుధాలను బలోపేతం చేసుకోవాలని ఉత్తర కొరియా నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కిషిదా, ఫ్రాన్సిస్ వాటికన్‌లోని గెస్ట్ రూమ్‌లో దాదాపు 25 నిమిషాల పాటు చర్చలు జరిపారు. వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా కిషిడా చర్చలు జరిపారు.

ఉత్తర కొరియా చర్యలు శాంతి, భద్రత, అంతర్జాతీయ సమాజ స్థిరత్వానికి విఘాతం కలిగిస్తున్నాయని, వాటిని అనుమతించలేమని కిషిదా రోమ్‌లో విలేకరులతో అన్నారు. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించినట్లు దక్షిణ కొరియా, జపాన్ అధికారులు తెలిపారు. క్షిపణి పరీక్షల అంశంపై ఇటలీ ప్రధాని మారియో ద్రాగితో కూడా చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు కిషిదా తెలిపారు.

Read Also… Minister Kishan Reddy: నా జీవితంలో ఎక్కువ సార్లు చూసిన సినిమా అదే.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి