Kim Jong Un: కిమ్ జోంగ్ మళ్లీ బరితెగించారు.. రహస్య ప్రాంతం లక్ష్యంగా క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా ఆందోళన

రహస్య ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా మరోసారి క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది.

Kim Jong Un: కిమ్ జోంగ్ మళ్లీ బరితెగించారు.. రహస్య ప్రాంతం లక్ష్యంగా క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా ఆందోళన
Kim Jong Un

Updated on: May 04, 2022 | 12:21 PM

North Korea Fires Projectile: రహస్య ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా మరోసారి క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. ఉత్తర కొరియా మరోసారి క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా ఆరోపించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ షేర్ చేశారు. అవసరమైతే అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తానని ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ చాలాసార్లు నేరుగా బెదిరించిన తరుణంలో ఈ చర్యకు పాల్పడి ఉంటుందని దక్షిణ కొరియా వెల్లడించింది.

ఇదిలావుంటే, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త వ్యూహాత్మక మార్గదర్శక ఆయుధాన్ని పరీక్షించారు. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాల మధ్య ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫోటోలను కూడా ఉత్తర కొరియా షేర్ చేసింది.


ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటి వరకు 13 సార్లు ఆయుధాలను పరీక్షించింది. ఈ పరీక్షల్లో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్ష కూడా ఉంది. ఆంక్షల సడలింపు, ఇతర రాయితీలు పొందేలా అమెరికాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఉత్తర కొరియా నిరంతరం ఆయుధాలను పరీక్షిస్తోందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.

Read Also…  Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు