Tsunami: రష్యా, జపాన్‌ను వణికించిన భారీ సునామీ.. భారత్‌కు తప్పిన ముప్పు.!

పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టించింది. రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడింది సునామీ. 4 మీటర్ల వరకు రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ పడింది. అమెరికా తీరాలను తాకనుంది సునామీ. అలాస్కా, హవాయి, వాషింగ్టన్‌.. ఒరెగాన్, నార్త్ కాలిఫోర్నియా తీరాలను తాకింది సునామీ.

Tsunami: రష్యా, జపాన్‌ను వణికించిన భారీ సునామీ.. భారత్‌కు తప్పిన ముప్పు.!
Tsunami India

Updated on: Jul 30, 2025 | 1:44 PM

రష్యాలో బుధవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా రష్యా, జపాన్‌, తీర ప్రాంతాలను సునామీ అలలు తాకాయి. అయితే ఈ సునామీ అమెరికా, భారత్‌ను కూడా తాకవచ్చని హెచ్చిరించిన నేపథ్యంలో తాజాగా ఇండియన్ నేషనల్‌ సెంటర్ ఫర్‌ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఈ సునామీ వల్ల భారత్‌కు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. ఈమేరకు ఇన్‌కాయిస్ (INCOIS) ఎక్స్‌లో పోస్టు చేసింది.

‘కామ్చాట్‌స్కీ తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం సునామీ తాకింది. అయితే, దీని కారణంగా భారత్‌కు సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు’ అని రాసుకొచ్చింది. రష్యా తీరప్రాంతమైన పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్‌స్కీలో భారీ భూకంపం వచ్చింది. అనంతరం రష్యాలోని కురిల్‌ దీవులు, జపాన్‌ లోని హక్కైడో దీవులను సునామీ తాకింది. అలలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈక్రమంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్‌ అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎక్స్‌లో తెలిపింది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు జారీ చేసే అలర్ట్‌లను తెలుసుకుంటూ వాటిని పాటించాలని తెలిపింది. సునామీ హెచ్చరిక జారీ అయితే ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని పేర్కొంది. ఈసందర్భంగా కాన్సులేట్‌ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా జారీ చేసింది.

మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..