అమ్మా, నాన్న కావాలన్న 9 ఏళ్ల అనాథ.. ముందుకొచ్చిన 5వేల మంది

| Edited By:

Aug 18, 2020 | 3:50 PM

ఎవరూ లేకుండా అనాథలుగా బతకడం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేనిది. స్వయంగా అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుంది

అమ్మా, నాన్న కావాలన్న 9 ఏళ్ల అనాథ.. ముందుకొచ్చిన 5వేల మంది
Follow us on

Nine year old boy adoption:ఎవరూ లేకుండా అనాథలుగా బతకడం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేనిది. స్వయంగా అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుంది. ఈ క్రమంలో ఓ తొమ్మిదేళ్ల పిల్లాడి వేదన జనాలను కదిలించింది. దీంతో అతడిని దత్తత తీసుకుంటామంటూ ఇప్పటికే 5వేల మంది ముందుకొచ్చి అప్లై చేసుకున్నారు. ఇంకా సంఖ్య పెరుగుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. తొమ్మిదేళ జోర్డన్ తన సోదరుడితో కలిసి గత ఆరేళ్లుగా ఓ అనాథాశ్రమంలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం జోర్డన్ తమ్ముడిని ఓ కుటుంబం దత్తత తీసుకుంది. దాంతో మరింత ఒంటరి వాడైన జోర్డాన్‌.. ఏ ప్లేస్ టు కాల్ హోమ్ అనే లైవ్‌ షోలో తన బాధను వ్యక్తపరిచాడు. తనకంటూ ఓ కుటుంబం ఉంటే ఎంతో సంతోషిస్తానని జోర్డన్ వెల్లడించాడు. తాను మాట్లాడటానికి, కనీసం తన మనసులోని భావాలను తెలపడానికైనా తనకు ఓ కుటుంబం కావాలని  బలంగా కోరుకుంటున్నా అని పేర్కొన్నాడు. ఈ షో చూస్తున్న వారిలో ఎవరైనా తనను దత్తత తీసుకుంటారని ఆశిస్తున్నానని వెల్లడించాడు.

అతడి వేదన షో చూసిన చాలా మందిని కదిలించింది. జోర్డన్‌ని దత్తత తీసుకోవడనానికి చాలా మంది ఆసక్తి చూపారు. ఈ క్రమంలో జోర్డాన్‌ ఉంటున్న ఆశ్రమానికి దాదాపు 5వేల అప్లికేషన్ల పైనే వచ్చాయి. ప్రస్తుతం ఆశ్రమ నిర్వహకులు.. జోర్డాన్‌ను పంపేందుకు తగిన వ్యక్తుల కోసం పరిశీలిస్తున్నారు. కాగా గతంలో చాలా మంది జోర్డాన్‌ను దత్తత తీసుకెళ్లారని, కానీ తమ కుటుంబానికి అతడు సరిపోడని చాలా మంది మళ్లీ ఇక్కడే వదిలేసి వెళ్లారని ఆశ్రమ నిర్వహకుడు తెలిపారు.

Read More:

అంబులెన్స్‌కి కన్నం వేసి లోపల కూర్చున్నాడు.. ఈ లోపే

కరోనా వ్యాక్సిన్ ఒప్పందంలో కేంద్రం తొలి అడుగు