AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైజీరియాలో మరో కలకలం.. ఏకంగా 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన బండిపోట్లు.. ఆందోళనలో తల్లిదండ్రులు..

నైజీరియాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో అట్టుడికే నైజీరియాలో మరోసారి నిషేధిత మిలిటెంట్ల బృందం రెచ్చిపోయింది. ఓ ప్రభుత్వ

నైజీరియాలో మరో కలకలం.. ఏకంగా 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన బండిపోట్లు.. ఆందోళనలో తల్లిదండ్రులు..
Shiva Prajapati
|

Updated on: Dec 14, 2020 | 8:11 AM

Share

నైజీరియాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో అట్టుడికే నైజీరియాలో మరోసారి నిషేధిత మిలిటెంట్ల బృందం రెచ్చిపోయింది. ఓ ప్రభుత్వ పాఠశాలపై దాడికి తెగబడి 400 మంది విద్యార్థులను ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన విద్యార్థుల కోసం నైజీరియన్ ఆర్మీ గాలింపు చేపట్టింది. అసలేం జరిగిందంటే.. నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో మారణాయుధాలు కలిగిన మిలిటెంట్లు భారీ సంఖ్యలో వచ్చి ఓ ప్రభుత్వ స్కూల్‌పై దాడి చేశారు. దాదాపు 400 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. స్కూల్‌లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా, 200 మంది ఆ బందిపోట్ల నుండి తప్పించుకోగలిగారు. అయితే దీనికి ముందు విషయం తెలుసుకున్న నైజీరియన్ భద్రతా బలగాలు సంబంధిత స్కూల్ వద్దకు చేరుకున్నారు. బందిపోట్లపై ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో 200 మంది విద్యార్థులను వారు రక్షించగలిగారు. మిగతా విద్యార్థులను రక్షించలేకపోయారు. ఇరు పక్షాల దాడులతో ఆ ప్రాంతంలో తీవ్ర భయానక పరిస్థితి ఏర్పడింది. కాగా, మొత్తం మీద ఆ బందీపోట్లు 400 మంది విద్యార్థులను ఎత్తుకుపోవడంతో సదరు విద్యార్థుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ పిల్లలను కాపాడాలంటూ భద్రతా బలగాలను వేడుకుంటున్నారు.

ఇదిలాఉండగా.. నైజీరియాలో కొద్దిరోజుల క్రితమే ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన రైతులను బోకో హరమ్ మిలిటెంట్లు అతికిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 43 మంది రైతుల చేతులు, కాళ్లూ కట్టేసి అతికిరాతంగా గొంతు కోసి చంపేశారు. అదే చోట పనికి వెళ్లిన మరికొంత మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఈ ఘటన నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Follow Us
మూడు ఫార్మాట్లు ఆడుతున్నా బుమ్రాకు రూ. 2 కోట్లు కోత తప్పదా ?
మూడు ఫార్మాట్లు ఆడుతున్నా బుమ్రాకు రూ. 2 కోట్లు కోత తప్పదా ?
రంజాన్ స్పెషల్.. డ్రై ఫ్రూట్ పాయసం.. పండుగలకి బెస్ట్ స్వీట్ ఇదే
రంజాన్ స్పెషల్.. డ్రై ఫ్రూట్ పాయసం.. పండుగలకి బెస్ట్ స్వీట్ ఇదే
ఏపీలో ఉద్యోగాల జాతర.. నిరుద్యోగులకు ఉగాదికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఏపీ సర్కార్..
ఏపీలో ఉద్యోగాల జాతర.. నిరుద్యోగులకు ఉగాదికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఏపీ సర్కార్..
2029లో జమిలి సాధ్యమేనా? సీఎం రేవంత్‌ వ్యాఖ్యలతో సరికొత్త చర్చ
2029లో జమిలి సాధ్యమేనా? సీఎం రేవంత్‌ వ్యాఖ్యలతో సరికొత్త చర్చ
HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటంటే..?
HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటంటే..?
ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీ.. ఈసారి క్రిస్ గేల్ రికార్డు గల్లంతేనా?
ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీ.. ఈసారి క్రిస్ గేల్ రికార్డు గల్లంతేనా?
CSMT గడియారపు డిజైన్‌తో టైటాన్ వాచ్..ఫ్యాషన్‌ ప్రియులకు గిఫ్ట్‌
CSMT గడియారపు డిజైన్‌తో టైటాన్ వాచ్..ఫ్యాషన్‌ ప్రియులకు గిఫ్ట్‌
పింక్ అండ్ పర్పుల్ కుర్తాలో దీపికా సరికొత్త ట్రెండ్!
పింక్ అండ్ పర్పుల్ కుర్తాలో దీపికా సరికొత్త ట్రెండ్!
మరోసారి ట్రోఫీ తెచ్చే మొనగాళ్లురా బుజ్జి.. అడ్డుకోవడం కష్టమే..!
మరోసారి ట్రోఫీ తెచ్చే మొనగాళ్లురా బుజ్జి.. అడ్డుకోవడం కష్టమే..!
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ..పవన్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ..పవన్ మూవీ టాక్ ఎలా ఉందంటే?