Nigeria explosion: ఘోర ప్రమాదం.. ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి పైగా సజీవ దహనం!

|

Apr 24, 2022 | 6:59 AM

Nigeria explosion: నైజీరియా దేశంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ నైజీరియాలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించి దాదాపు 100 మంది వరకు

Nigeria explosion: ఘోర ప్రమాదం.. ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి పైగా సజీవ దహనం!
Nigeria Explosion
Follow us on

Nigeria explosion: నైజీరియా దేశంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ నైజీరియాలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించి దాదాపు 100 మంది వరకు మరణించినట్లు ఆ దేశానికి సంబంధించిన ఓ స్వచ్ఛంద సంస్థ శనివారం వెల్లడించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో చాలా మంది సజీవదహనమైనట్లు తెలిపింది. అక్రమ చమురు (illegal oil refinery) శుద్ధి కర్మాగారంలో పేలుడు ఘటనను పోలీసులు ధృవీకరించారు. అయితే ప్రాణనష్టం వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో గుర్తించలేనంతగా కాలిపోయిన అనేక మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించిన కొందరి మృతదేహాలు చెట్ల కొమ్మలకు వేలాడుతూ కనిపించాయని యూత్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ అడ్వకేసీ సెంటర్ (YEAC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైన్‌ఫేస్ డుమ్నామెన్ పేర్కొన్నారు. నైజీరియన్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ పేలుడులో 100 మందికి పైగా మరణించారు. ఆఫ్రికాలో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి చేసే అక్రమ కర్మాగారం నైజీరియాలో ఉన్నాయి.

శుక్రవారం అర్థరాత్రి అక్రమ రిఫైనరీ స్థలంలో పేలుడు సంభవించిందని.. నిర్వాహకులు, వారి అనుచరులు, వ్యాపారులు అక్కడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన రివర్స్ మరియు ఇమో స్టేట్ మధ్య సరిహద్దులో జరిగినట్లు అని రివర్స్ స్టేట్ పోలీసు ప్రతినిధి గ్రేస్ ఇరింగే-కోకో తెలిపారు. దక్షిణ-చమురు ప్రాంతంలో అక్రమ ముడి చమురు శుద్ధి సర్వసాధారణం. ఇక్కడ చమురు దొంగలు ముడిచమురును దొంగిలించడానికి పైప్‌లైన్‌లను ధ్వంసం చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేందుకు శుద్ధి చేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

చమురు ఉత్పత్తి చేసే నైజర్ డెల్టా.. దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. రోజుకు సుమారు రెండు మిలియన్ బ్యారెల్స్ ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. దీంతోపాటు ఇక్కడ ప్రమాదాలు కూడా తరచూ జరుగుతుంటాయి. కాగా.. దేశంలోని చమురు వనరులను దొంగిలించడాన్ని నిరోధించే చర్యల్లో భాగంగా నైజర్ డెల్టాలో అక్రమ శుద్ధి కర్మాగారాలపై దాడి చేసి ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది.

Also Read:

America: చికాగోలో కారు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి.. ముగ్గురికి గాయాలు..ఒకరి పరిస్థితి విషమం

Russia – Ukraine War: ఆగని బాంబుల వర్షం.. ఉక్రెయిన్ కు అగ్రరాజ్యం సహాయం