New Covid Variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ముప్పు తప్పదా ?

అమెరికాలో అమెరికాలో మరో కొత్త వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. కొవిడ్ 19 కి చెందిన అత్యంత పరివర్తన చెందినటువంటి కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు అమెరికాకు చెందినటువంటి వ్యాధి నియంత్రణ కేంద్రం పేర్కొంది. అయితే ఈ వేరియంట్‌కు బీఏ.2.86 గా నామకరణం చేసినట్లు పేర్కొంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ అమెరికాతో సహా ఇజ్రాయెల్, డెన్మార్క్ దేశాల్లో కూడా బయటపడినట్లు వెల్లడించింది.

New Covid Variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ముప్పు తప్పదా ?
Corona Virus

Updated on: Aug 19, 2023 | 5:13 AM

గత మూడు సంవత్సరాలుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఇప్పుడు ఇండియాలో రోజువారిగా నమోదయ్యే కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రజలు తమ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మరోసారి ఆందోళనను కలిగిస్తున్నాయిు. ఇప్పటికే ఈజీ.5 అనే వేరియంట్ అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో వెలుగు చూసింది. అయితే ఇప్పుడు తాజాగా అమెరికాలో అమెరికాలో మరో కొత్త వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. కొవిడ్ 19 కి చెందిన అత్యంత పరివర్తన చెందినటువంటి కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు అమెరికాకు చెందినటువంటి వ్యాధి నియంత్రణ కేంద్రం పేర్కొంది. అయితే ఈ వేరియంట్‌కు బీఏ.2.86 గా నామకరణం చేసినట్లు పేర్కొంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ అమెరికాతో సహా ఇజ్రాయెల్, డెన్మార్క్ దేశాల్లో కూడా బయటపడినట్లు వెల్లడించింది.

కొవిడ్‌ 19 కి చెందిన మరో కొత్త వేరియంట్‌ను కనుగొన్నామని.. దీనికి బీఏ.2.86 అని పేరు పెట్టినట్లు అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. అలాగే ఈ వేరియంట్ నుంచి కూడా ప్రస్తుతం పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. బీఏ.2.86లో అధిక సంఖ్యలో ఉత్పరివర్తనలు కలిగి ఉన్నందువల్ల దానిని పర్యవేక్షణలో ఉన్నటువంటి వేరియంట్‌గా పేర్కొన్నట్లు తెలిపింది. అయితే ఈ రకానికి చెందినటువంటి సీక్వెన్స్‌లు కొన్ని దేశాల్లో కూడా వెలుగు చూసినట్లు తెలిపింది. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. కొవిడ్ -19 కి కారణమయ్యేటటువంటి వైరస్ SARS-CoV-2తో పాటు అన్ని వైరస్‌లు కాలక్రమేనా రూపాంతరం చెందుతూ.. తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అయితే ఈ మార్పులు వైరస్ లక్షణాలపై మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపవు.

ఇవి కూడా చదవండి

అయినా కూడా ఈ వైరస్ వైరస్ ఎంతవేగంగా వ్యాపిస్తోంది, వ్యాధి తీవ్రత, వ్యాక్సిన్‌లు.. చికిత్సా ఔషధాల పనితీరు వంటి కొన్ని మార్పులు ఈ వైరస్ లక్షణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వల్ల అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్‌ కొత్త కొత్తగా మార్పులు చెందడం వల్ల ఏదైన ప్రమాదకరమైన వేరియంట్ వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం చాలావరకు కరోనా వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి ప్రమాదకరమైన వేరియంట్‌ల నుంచి ఎంతవరకు రక్షిస్తాయన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.