డ్రాగన్ ట్రాప్‌లో నేపాల్.. నేపాల్ కరెన్సీ నోటుపై భారత భూభాగాలు..!

నేపాల్ మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈసారి నేపాల్ చైనా తరహాలోనే వ్యవహరించింది. తన కొత్త 100 రూపాయల కరెన్సీపై మూడు భారతీయ భూభాగాలను తనవిగా చిత్రీకరించడం ద్వారా కొత్త వివాదానికి దారితీసింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలలో పెద్ద ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. నేపాల్ కేంద్ర బ్యాంకు గురువారం (నవంబర్ 27) కొత్త 100 రూపాయల నోటును విడుదల చేసింది.

డ్రాగన్ ట్రాప్‌లో నేపాల్.. నేపాల్ కరెన్సీ నోటుపై భారత భూభాగాలు..!
Nepal Currency

Updated on: Nov 27, 2025 | 8:44 PM

నేపాల్ మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈసారి నేపాల్ చైనా తరహాలోనే వ్యవహరించింది. తన కొత్త 100 రూపాయల కరెన్సీపై మూడు భారతీయ భూభాగాలను తనవిగా చిత్రీకరించడం ద్వారా కొత్త వివాదానికి దారితీసింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలలో పెద్ద ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. నేపాల్ కేంద్ర బ్యాంకు గురువారం (నవంబర్ 27) కొత్త 100 రూపాయల నోటును విడుదల చేసింది. ఇందులో దేశం సవరించిన రాజకీయ పటం ఉంది.

రూ.100 కరెన్సీ నోటుపై ముద్రించిన ఈ మ్యాప్‌లో, నేపాల్ వివాదాస్పద కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా చిత్రీకరించింది. భారతదేశం ఈ చర్యను ఏకపక్ష, కృత్రిమ ప్రాదేశిక విస్తరణగా పేర్కొంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (NRB) జారీ చేసిన ఈ కొత్త నోట్‌లో మాజీ గవర్నర్ డాక్టర్ మహా ప్రసాద్ అధికారి సంతకం ఉంది. జారీ తేదీ, విక్రమ్ సంవత్ 2081 (2024 AD) గా పేర్కొన్నారు. మే 2020లో అప్పటి ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణను ఆమోదించింది. అధికారికంగా కొత్త మ్యాప్‌ను గుర్తించింది. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురలను తన భూభాగంలో చేర్చింది. అదే సవరించిన మ్యాప్ ఇప్పుడు రూ.100 నోటుపై ముద్రించింది.

జెన్-జి ఉద్యమంలో ఇటీవల పదవీచ్యుతుడైన మాజీ ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి చర్యలే దీనికి కారణమని చెబుతున్నారు. నేపాల్ నోట్లలో 100 రూపాయల నోటుపై మాత్రమే దేశ పటం ముద్రించిందని ఎన్ఆర్బి ప్రతినిధి గుణకర్ భట్టా స్పష్టం చేశారు. 5, 10, 20, 50, 500, 1,000 రూపాయల నోట్లపై ఎలాంటి పటం లేదు. “పాత 100 రూపాయల నోటులో కూడా అదే పటం ఉంది. ఇప్పుడు అది ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మాత్రమే అధునీకరించాం” అని ఆయన అన్నారు.

నేపాల్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర భారతదేశంలో అంతర్భాగాలని, నేపాల్ తీసుకున్న ఈ చర్య వాస్తవంగా తప్పు. ఆమోదయోగ్యం కాదని భారతదేశం పునరుద్ఘాటించింది. నేపాల్ ఐదు భారతీయ రాష్ట్రాలతో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కలుపుకుని 1,850 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటుంది. ఈ ప్రాంతంపై రెండు దేశాలకు చాలా కాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..