మింగ మెతుకు లేదు కాని.. అణుదాడి అంటూ ఎగిరెగిరి పడుతున్న పాపిస్థానోడు..
పాక్ పిచ్చికూతలు ఇంకా ఆగడం లేదు. సింధూ నదీ జలాల విషయంలో భారత్ కఠినంగా ఉండడంతో ఏం చేయాలో తెలియక అక్కడి నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పటికే అణుబాంబు బూచిని చూపిస్తున్న పాక్.. ఇప్పుడు మూడు పరిస్థితులు ఎదురైనప్పుడు భారత్ పై అణుదాడికి దిగుతామంటూ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సహాయకుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు.

కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్లుగా.. పాక్ బుద్ధి ఎన్నటికీ మారదు. ఎంతసేపు భారత్‌పై విషం గక్కడమే ఆ దేశ నాయకులు, ఆర్మీ పని. ఆపరేషన్ సింధూర్‌తో దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పినప్పటికీ ఆ దేశం తీరులో ఎటువంటి మార్పు లేదు. పైగ అణుబాంబు అంటూ బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. అణుబాంబు బెదిరింపులకు భయపడేది లేదని.. మరోసారి తోకజాడిస్తే దారుణ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తదని మోదీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలో పాక్ పొలిటికల్ కామెంటేటర్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సహాయకుడు నజామ్ సేథి ఓ ఇంటర్వ్యూలో మరోసారి పిచ్చికూతలు కూశాడు. ఏకంగా ఒక అడుగు ముందుకేసి.. మూడు ప్రత్యేక పరిస్థితుల్లో భారత్‌పై అణుదాడికి పాల్పడతామంటూ పిచ్చి ప్రేలాపనలకు దిగాడు.
ఈ మూడు పరిస్థితుల్లో..
పాకిస్తాన్ సముద్ర ప్రయాణాన్ని అడ్డుకునే విధంగా కరాచీ ఓడరేవును భారత్ ఆక్రమించినప్పుడు అణుదాడికి దిగుతామని సేథి అన్నాడు. భారత సైన్యం కరాచీ, లాహోర్‌లోకి చొచ్చుకువచ్చి దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను విభజించేందుకు కుట్రలు చేస్తే అణుబాంబులు వేస్తామన్నాడు. పాక్‌కు సింధూ నదీ జలాలు అందకుండా భారత్ ఏమైన ప్రాజెక్టులు కడితే వాటిన పేల్చేస్తామని అన్నాడు. అంతేకాకుండా ఆ పరిస్థితిలో అణుదాడికి దిగుతామని హెచ్చరించారు. తాము అణుబాంబులను దీపావళి కోసం తయారుచేయలేదంటూ వ్యాఖ్యానించాడు.
ఇటువంటి వ్యాఖ్యలు పాకిస్థాన్ నుంచి రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చాలా మంది ఇలాంటి పిచ్చకూతలు కూశారు. సింధు జల ఒప్పందంపై భారతదేశం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు మరింత పెరిగాయి. భారత్ తమ నీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే గట్టి ప్రతీకారం ఉంటుందని.. పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క కూడా లాక్కోలేరని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గతంలో వ్యాఖ్యానించారు. భారత్ నుంచి తమ ఉనికికి ముప్పు ఎదురైతే పాకిస్తాన్ సగం ప్రపంచాన్ని కూల్చివేస్తుంది అంటూ అమెరికాలో పిచ్చి ప్రేలాపలు పేలాడు. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.
రక్తం – నీరు ఒకేచోట పారదు
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సింధు జల ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రైతుల ప్రయోజనాలు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. సింధూ నదీపై భారత్‌కే పూర్తి హక్కులు ఉన్నట్లు వ్యాఖ్యానించారు. పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపే వరకు రక్తం – నీరు ఒకేచోట పారదన్నారు. సింధూ నదీ నీటిని దేశంలో రైతుల అవసరాలకు వినియోగిస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
