చెత్త కారణంతో ప్రతిష్టాత్మక మహిళల స్పేస్‌వాక్ క్యాన్సిల్.. మండిపడుతున్న నెటిజన్లు

చెత్త కారణంతో ప్రతిష్టాత్మక మహిళల స్పేస్‌వాక్ క్యాన్సిల్.. మండిపడుతున్న  నెటిజన్లు

ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా ఇద్దరు మహిళలతో అంతరిక్ష ప్రయాణానికి శ్రీకారం చుట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. అయితే ఉన్నట్లుండి ఈ స్పేస్‌ వాక్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. అందుకు ఒక చెత్త కారణాన్ని చెప్పింది. దీంతో నాసాపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళా వ్యోమగాములు అన్నే మెక్ క్లైన్, క్రిస్టియానా కోచ్‌లతో తొలిసారి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్‌ను చేయించాలనుకుంది నాసా. అందుకు తగ్గట్లుగా వారిద్దరిని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మార్చి […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Mar 27, 2019 | 4:57 PM

ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా ఇద్దరు మహిళలతో అంతరిక్ష ప్రయాణానికి శ్రీకారం చుట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. అయితే ఉన్నట్లుండి ఈ స్పేస్‌ వాక్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. అందుకు ఒక చెత్త కారణాన్ని చెప్పింది. దీంతో నాసాపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

మహిళా వ్యోమగాములు అన్నే మెక్ క్లైన్, క్రిస్టియానా కోచ్‌లతో తొలిసారి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్‌ను చేయించాలనుకుంది నాసా. అందుకు తగ్గట్లుగా వారిద్దరిని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 29న వారి స్పేస్ వాక్ జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్లుండి ఈ వాక్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నాసా స్పష్టం చేసింది. సరైన స్పేస్ షూట్ లేని కారణాంగా ఈ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని నాసా సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఆ రోజుకు ఒకరికి మాత్రమే స్పేస్ షూట్ సిద్దంగా ఉందని, అందుకే మెక్ క్లైన్ బలవంతంగా తన అంతరిక్ష ప్రయాణాన్ని ఆపుకోవాల్సి వచ్చిందని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో మీడియం సైజ్ హార్డ్ అప్పర్ టోర్స్‌తో మైక్ క్లైమ్ అంతరిక్ష ప్రయాణాన్ని చేసింది. అయితే ఇప్పుడు ఆ పరిమాణానికి సంబంధించిన షూట్ నాసా దగ్గర ఒకటి మాత్రమే ఉండగా.. దానిని క్రిస్టియానా కోచ్‌కు ఇస్తున్నారు. దీంతో ఈ ప్రయాణాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని వారు తెలిపారు. కాగా  ఈ స్పేస్ వాక్ ఏప్రిల్8కి వాయిదా పడిందని, అప్పుడు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి డేవిడ్ సైంట్ జాక్వెస్‌తో కలిసి మెక్ క్లైమ్ ప్రయాణం చేయనుందని నాసా ప్రకటించింది.

అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై నాసా లింగ వివక్ష చూపిస్తోందని వారు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నాసా ప్రకటనపై జోక్‌లు చేస్తున్నారు. కాగా ఈ ప్రకటనపై అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు. అలాంటప్పుడు ఇంకో షూట్ తయారుచేయండి అంటూ ఆమె కామెంట్ పెట్టారు.

మరోవైపు ఈ కామెంట్లపై నాసా స్పందించింది. మీ కామెంట్లను అన్నీ చూశాం. మా దగ్గర మీడియం సైజ్ స్పేస్‌ షూట్‌లు ఉన్నాయి. కానీ అంతరిక్ష స్పేస్ స్టేషన్‌ షెడ్యూల్ మూలంగా స్పేస్ షూట్‌లను తిరిగి తయారు చేయడం కంటే వ్యోమగాముల కేటాయింపులను మార్చడం మంచిది అంటూ కామెంట్ చేసింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu