AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సురక్షితంగా భూమికి చేరిన నాసా వ్యోమమగామి క్రిస్టినా కోచ్

అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడిపిన నాసా మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్ గురువారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. రష్యన్ స్పేస్ ఏజన్సీకి చెందిన సోయజ్ కమాండర్ అలెగ్జాండర్ స్కొవొర్ట్ సోక్, యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ల్యూకా పర్మిటానోతో కలిసి ఆమె భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 12 నిముషాలకు కజకిస్తాన్ లోని ఓ మారుమూల పట్టణంలో దిగారు. ఇంటర్నేషనల్ స్పేస్  స్టేషన్ నుంచి వీరు ఈ తెల్లవారుజామున 12 గంటల 50 నిముషాలకు […]

సురక్షితంగా భూమికి చేరిన నాసా వ్యోమమగామి క్రిస్టినా కోచ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 06, 2020 | 5:55 PM

Share

అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడిపిన నాసా మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్ గురువారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. రష్యన్ స్పేస్ ఏజన్సీకి చెందిన సోయజ్ కమాండర్ అలెగ్జాండర్ స్కొవొర్ట్ సోక్, యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ల్యూకా పర్మిటానోతో కలిసి ఆమె భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 12 నిముషాలకు కజకిస్తాన్ లోని ఓ మారుమూల పట్టణంలో దిగారు. ఇంటర్నేషనల్ స్పేస్  స్టేషన్ నుంచి వీరు ఈ తెల్లవారుజామున 12 గంటల 50 నిముషాలకు భూమికి బయలుదేరారు. మంచు కురుస్తున్న వేళ, అతి శీతల వాతావరణంలో, గజగజ వణికించే చలిలో వీరు  భూమికి చేరగానే నాసా శాస్త్రజ్ఞులు, ‘ ఆత్మీయులు’ సాదర స్వాగతం పలికారు.  క్రిస్టినా కోచ్ తొలి స్పేస్ ఫ్లైట్ సాధారణమైనదేమీ కాదు.. ఇది 328 రోజుల బృహత్తర మిషన్.. ఈ యానం భూకక్ష్యలో 5,248 పరిభ్రమణాలు, 139 మిలియన్ మైళ్ళ జర్నీతో కూడుకున్నది.  ఒక విధంగా చంద్ర గ్రహంపైకి వ్యోమయానం,  తిరిగి భూమికి చేరే 291 ట్రిప్పులతో సమానమట. ఒక మహిళ అతి సుదీర్ఘ కాలం  రోదసి యానం చేసిన ఘటనను నాసా అత్యంత ప్రధానమైనదిగా పేర్కొంటున్నది. క్రిస్టినా గత ఏడాది మార్చి  14 న మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి రోదసి ప్రయాణం ప్రారంభించింది. తన  రోదసి యానంలో ఆమె ఆరు స్పేస్ వాక్ లు చేసింది. అంతరిక్ష కేంద్రం బయట 42 గంటల 15 నిముషాలు గడిపింది. ఇక నాసా చంద్ర గ్రహం, అంగారక గ్రహం పైకి వ్యోమగాములను పంపి, తిరిగి వారిని భూమికి చేర్చే ప్రణాళికలను రచిస్తోంది.