NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ చాలా నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నారు. ఆమె ఈ సంవత్సరం క్రిస్మస్‌ను అక్కడే జరుపుకుంటున్నారు. సునీతా విలియమ్స్‌తోపాటు అంతరిక్షంలో నివసిస్తున్న ముగ్గురు వ్యోమగాములు – డాన్ పెటిట్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేసింది నాసా. ఈ వ్యోమగాముల బృందం అంతరిక్షం నుండి క్రిస్మస్ ఆనందాన్ని పంచుతోంది. అలాగే అంతరిక్షంలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేక సన్నాహాలు చేసింది నాసా.
To everyone on Earth, Merry Christmas from our @NASA_Astronauts aboard the International @Space_Station. pic.twitter.com/GoOZjXJYLP
— NASA (@NASA) December 23, 2024
వాస్తవానికి జూన్ 14వ తేదీనే వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వ్యోమగాములు ఆరోగ్యం మీద అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే నాసా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. వ్యామగాముల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటున్నామని ఎపటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వారి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా సునీతా విలియమ్స్, మిగతా వారు స్పేస్‌లో క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటున్న వీడియోను తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది నాసా. ఇందులో సునీతా మాట్లాడారు.తామందరం బాగానే ఉన్నామని.. క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నామని, భూమి మీద ఉన్నవారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..