Burundi prison fire: నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది ఖైదీల సజీవదహనం.. 69మందికి గాయాలు!

|

Dec 07, 2021 | 7:00 PM

నైరోబి దేశంలో దారుణం జరిగింది. బురుండి రాజధాని గితెగాలోని ప్రధాన జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 38 మంది ఖైదీలు మరణించారు.

Burundi prison fire: నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది ఖైదీల సజీవదహనం.. 69మందికి గాయాలు!
Burundi Prison Fire
Follow us on

Nairobi prison fire: నైరోబి దేశంలో దారుణం జరిగింది. బురుండి రాజధాని గితెగాలోని ప్రధాన జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 38 మంది ఖైదీలు మరణించారు. మరో 69మంది ఖైదీలు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు తెలిపారు. ఖైదీలందరు నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. జైలు నుంచి బయటకు వెళ్లలేని ఖైదీలు సజీవ దహనమయ్యారని వైస్ ప్రెసిడెంట్ ప్రాస్పర్ బజోంబాంజా తెలిపాయి. అయితే గీతేగా జైలు మంటలకు కారణమేమిటో చెప్పలేదు. మరణించిన వారిలో చాలా మంది వృద్ధ ఖైదీలు ఉన్నట్లు సమాచారం.

కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మిలటరీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు.. ఆర్మీ పికప్ ట్రక్కులలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై అధికారులెవరు వ్యాఖ్యానించేందుకు నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది. “మంటలు చాలా ఎక్కువగా ఎగసిపడటం చూశామని, సజీవ దహనం అవుతున్నామని అరవడం ప్రారంభించాము, కాని పోలీసులు మా క్వార్టర్స్ తలుపులు తెరవడానికి నిరాకరించారని ప్రత్యక్ష సాక్షి అయిన ఖైదీ ఒకరు చెప్పారు. “నేను ఎలాగో తప్పించుకున్నాను , కానీ పూర్తిగా కాలిపోయిన ఖైదీలు ఉన్నారు.” అని చెప్పుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బురుండిలోని రెడ్‌క్రాస్ బృందాలు బాధితులను ఆదుకునేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, స్వల్పంగా ఉన్న మరికొందరికి చికిత్స అందిస్తున్నారు.

కాగా, బురుండి క్రిస్టియన్ అసోసియేషన్ ప్రకారం, 400 మంది ఖైదీల సామర్థ్యం కలిగిన గితెగా జైలులో గత నెల నాటికి 1,539 మంది ఖైదీలను ఉంచారని ఆరోపించారు. మరోవైపు, బురుండి అంతర్గత మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసిన ట్వీట్‌లో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పేర్కొంది.


ఇదిలావుంటే, ఇదే జైలులో ఆగస్టు నెలలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ సమస్య కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. కానీ, ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Read Also….  Millionaire Girl: పదేళ్ల వయసులోనే రాజభోగాలు.. చిన్నవయసులోనే కోటీశ్వరురాలైన చిన్నారి..!