Poveglia Island: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానక ద్వీపం.. 1,60,000 మందిని సజీవ దహనం చేశారు.

|

Dec 05, 2021 | 6:25 AM

Poveglia Island: ఈ భూ ప్రపంచం అనేక రహస్యాలకు నెలవు. ఈ రహస్యాలలో ప్రజలకు తెలిసింది గోరంత మాత్రమే. ఇంకా తెలియాల్సింది కొండంత ఉంది. అయితే, తెలిసిన వాటిలో

Poveglia Island: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానక ద్వీపం.. 1,60,000 మందిని సజీవ దహనం చేశారు.
Iland
Follow us on

Poveglia Island: ఈ భూ ప్రపంచం అనేక రహస్యాలకు నెలవు. ఈ రహస్యాలలో ప్రజలకు తెలిసింది గోరంత మాత్రమే. ఇంకా తెలియాల్సింది కొండంత ఉంది. అయితే, తెలిసిన వాటిలో ఇవాళ మనం ఓ రహస్య ద్వీపం గురించి చర్చించుకోబోతున్నాం. దానికి గురించిన వాస్తవాలు తెలిస్తే గూస్‌బమ్స్ రావడం ఖాయం. ఈ ద్వీపంలోని రహస్యం ఏంటి? అసలు దాని చరిత్ర ఏంటి? అంత ప్రత్యేకత ఏంటి? అక్కడికి ఎవరినీ అనుమతించరు ఎందుకు? వంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రహస్య ద్వీపం పేరు పోవెగ్లియా. ఇది ఇటలీ దేశంలో ఉంది. ఇది ఎల్లప్పుడూ రహస్యాలకు కేరాఫ్‌లా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ ద్వీపానికి వెళ్లిన వారు ఎవరు కూడా తిరిగిరాలేదని చెబుతుంటారు. అందుకే దీనిని రహస్య ద్వీపంగా పిలుస్తుంటారు. ఈ ద్వీపం ఇటాలియన్ నగరం వెనిస్, లిడో మధ్య వెనీషియన్ గల్ఫ్‌లో ఉంది. ఈ ద్వీపం రహస్యాన్ని బట్టబయలు చేసే ప్రయత్నంలో చాలా మంది అక్కడికి వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ తిరిగి రాలేకపోయారు. దాంతో అలర్ట్ అయిన ఇటలీ ప్రభుత్వం.. ఆ ద్వీపానికి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది. అప్పటి నుంచి ఈ ద్వీపానికి ఎవరూ వెళ్లటం లేదు.

వందల ఏళ్ల క్రితం ఇటలీలో ప్లేగు మహమ్మారి విపరీతంగా వ్యాపించిందట. ఆ సమయంలో దీనికి ఎటువంటి నివారణ లేదు. దాంతో ప్రభుత్వం తన ప్రజల గురించి తీవ్ర ఆందోళన చెందింది. ఈ వ్యాధి కారణంగా.. ప్రభుత్వం సుమారు 160,000 మంది రోగులను ఈ దీవికి తీసుకువచ్చి సజీవ దహనం చేసింది. కొంతకాలం తర్వాత దేశంలో బ్లాక్ ఫీవర్ అనే మరొక వ్యాధి చాలా వేగంగా వ్యాపించింది. ఈ బాధిత మృతదేహాలను కూడా అదే దీవిలో ఖననం చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుండి ఈ ద్వీపం శాపగ్రస్తమైందని స్థానికుల నమ్మకం. ఆ వ్యక్తుల ఆత్మలు నేటికీ ఇక్కడే తిరుగుతున్నాయని చెప్పుకుంటారు అక్కడి జనాలు. చాలా మంది ప్రజలు ఇక్కడ ఫాంటమ్ స్పిరిట్స్‌ని చూస్తున్నామని చెబుతుంటారు. దీంతో పాటు.. ఈ ద్వీపం నుండి తరచుగా వింత శబ్ధాలు వినిపిస్తాయని పేర్కొన్నారు. అయితే, ఇక్కడ జరుగుతున్న మిస్టరీ ఘటనల కారణంగా.. ఈ ద్వీపంలో ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అలా పొవెగ్లియా ద్వీపం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరుపొందింది.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం