ప్రపంచం చూపు మొత్తం చైనా వైపు… కానీ చైనా బిలియనీయర్స్ చూపు మాత్రం సింగపూర్‌పై. అవును, అమెరికాతో సహా అనేక టాప్ కంట్రీస్ పెట్టుబడులు పెట్టేది చైనాలోనే. అందుకే వరల్డ్ టాప్ కంపెనీస్ అన్నీ చైనాలో కొలువుదీరాయ్, అక్కడే తమ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తున్నాయ్. కానీ, కొన్నాళ్లుగా సీన్ రివర్స్ అవుతోంది. చైనా నుంచి తరలిపోతున్నాయ్ అనేక కంపెనీలు. ఇంతవరకూ ఓకే, కానీ చైనా కుబేరులు కూడా సొంత దేశం నుంచి వెళ్లిపోతున్నారు. చైనాలోనే ఉంటే తమ సంపదకు ముప్పు ఏర్పడుతుందని టెన్షన్ పడుతున్నారు వాళ్లంతా. అందుకే, పన్నులకు స్వర్గధామమైన సింగపూర్‌కు తరలిపోతున్నారు. ఇన్నాళ్లూ సంపాదించుకున్న డబ్బుతో సింగపూర్ చెక్కేస్తున్నారు. కుటుంబాలతో సహా షిఫ్టైపోతూ అక్కడే తమ వ్యాపార కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు చైనా కుబేరులు.
చైనా కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్ జాక్‌మా మాట తూలినందుకు ఆ కంపెనీపై కక్షగట్టింది ప్రభుత్వం. జాక్‌మా వ్యాపార సామ్రాజ్యంపై ఉక్కుపాదం మోపింది. దాంతో, పెద్దఎత్తున సంపదను కోల్పోవడమే కాకుండా, పరాయి దేశం జపాన్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జాక్‌మాకి. ఇదే పరిస్థితి తమకెందుకు రాదన్న అనుమానమే ఇప్పుడు చైనా కుబేరుల్లో మొదలైంది. ఆ భయంతోనే సింగపూర్‌కు మకాం మార్చేస్తున్నారు చైనా బిలియనీయర్స్. రీసెంట్‌గా చైనాలో అతిపెద్ద ఫుడ్ బిజినెస్ కంపెనీ అయిన హైదిలావ్ తన ఆపరేషన్స్‌ను సింగపూర్‌కు షిఫ్ట్ చేయడం ఆ దేశంలో కలకలం రేపుతోంది.
చైనా కుబేరులు సింగపూర్ తరలిపోవడానికి అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వ విధానాలు, అణచివేత ఒక కారణమైతే, అమెరికాతో పెరుగుతోన్న ఉద్రిక్త పరిస్థితులు మరో కారణమంటున్నారు ఆర్ధికవేత్తలు. చైనాలో తమ సంపదకు భద్రత లేదని, అదే సింగపూర్‌లో అయితే తమ సొమ్ము ఢోకా ఉండదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. చైనా బిలియనీయర్స్… సింగపూర్ తరలిపోతుండటంతో ఆ దేశంలో సంచలనం రేపుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..