హంగేరీలో జరిగిన భయానక యాక్సిడెంట్ జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 42 వాహనాలు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. అటు 19 వాహనాల్లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రాంతంలో ఇంతటి విధ్వంసానికి కారణం దుమ్ము తుఫాన్.
హంగేరీలోని బుడాపెస్ట్‌కు పశ్చిమాన 15 మైళ్ల (25 కిలోమీటర్లు) దూరంలో M1 హైవేపై ప్రాంతంలో దుమ్ము తుఫాను కారణంగా… రోడ్డు సరిగ్గా కనిపించకా 42 వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొన్నాయి.. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కాస్త ఒకదానిని ఒకటి అంటుకుంటూ అలా 19 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
విషయం తెలిసి స్పాట్‌కి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది..అటు నాలుగు రెస్క్యూ హెలికాప్టర్లు వచ్చాయి..ఈ ప్రమాదంలో 36 మందికి గాయాలు
అయ్యాయి..ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, 13 మందికి తీవ్రంగా గాయపడ్డారు..క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు..ఇక ఈ ప్రమాదం కారణంగా హైవేపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.