Death penalty: రాళ్లను సేకరించడమే నేరమైంది.. ఏకంగా మరణశిక్ష విధించిన అక్కడి అధికారులు..!

|

May 18, 2022 | 10:04 AM

Death penalty: ఇతర దేశాల్లో విధించే శిక్షలతో పోలిస్తే ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.

Death penalty: రాళ్లను సేకరించడమే నేరమైంది.. ఏకంగా మరణశిక్ష విధించిన అక్కడి అధికారులు..!
Iraq
Follow us on

Death penalty: ఇతర దేశాల్లో విధించే శిక్షలతో పోలిస్తే ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న నేరానికే అక్కడ మరణశిక్షలు విధిస్తుంటారు. తాజాగా ఇరాక్‌లో ఓ బ్రిటీషర్ కూడా మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు. అయితే అతడు చేసిన నేరం వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే జిమ్ ఫిట్టన్ అనే బ్రిటీషర్ ఓ రిటైర్డ్ జియాలజిస్ట్. అతడు జర్మనీకి చెందిన ఓ సైంటిస్టుతో కలిసి ఇరాక్‌లోని ఎరీదు ప్రాంతంలో ఉన్న ఓ పురావస్తు క్షేత్రాన్ని సందర్శించాడు. ఆ పురావస్తు కేంద్రం నుంచి గుర్తుగా 12 పురాతన రాళ్లను, కొన్ని కుండలు, జాడీలకు చెందిన పెంకులను వాళ్లిద్దరూ సేకరించారు.

అయితే తమ పురావస్తు సంపదను అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఇరాక్ అధికారులు ఫిట్టన్, జర్మనీ సైంటిస్ట్ వాల్డ్ మాన్‌ను మార్చి 20న బాగ్దాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి ఇరాక్ కోర్టులో హాజరుపరిచారు. తమకు ఇరాక్‌లోని చట్టాలు తెలియదని.. అందుకే రాళ్లను సేకరించామని న్యాయమూర్తి ముందు వాపోయారు. పురావస్తు కేంద్రంలో రాళ్లు సేకరించరాదన్న ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తాము ఈ పని చేశామని తెలిపారు. అయితే ఇరాక్‌లో ఈ నేరం తీవ్రమైనది కావడంతో న్యాయస్థానం మరణశిక్ష విధించింది. కాగా జిమ్ ఫిట్టన్‌ను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలంటూ అతడి కుటుంబ సభ్యులు ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ దాఖలు చేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఫిట్టన్‌కు మద్దతుగా 1.24 లక్షల మంది సంతకాలు చేశారు.