ఆస్ట్రేలియా కార్చిచ్చులో కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వన్యప్రాణి కోవాలా మృతి చెందింది. న్యూ సౌత్‌వేల్స్ అడవుల్లో మంటల్లో విలవిలలాడుతున్న కోవాలాను ప్రాణాలకు తెగించి కాపాడారు టోనీ డోహర్టీ. ఐతే తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది కోవాలా. కాళ్లు, ఛాతి భాగం కాలిపోవడంతో స్పెషల్ కేర్‌లో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.
ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లో రోజుల తరబడి కార్చిచ్చుకొనసాగుతోంది. వారం రోజుల క్రితం ఓలెక్సీ హైవేపై ప్రయాణిస్తున్నటోనీ డోహర్టీకి..కోవాలా అనే వన్యప్రాణి రోడ్డు దాటుతూ మండుతున్న అడవిలోకి వెళ్లడం కనిపించింది. దీంతో ధైర్యంగా వెళ్లి మంటల్లో చిక్కుకున్న కోవాలాను బయటకు తీసుకొచ్చారామె. చల్లటి నీళ్లతో గాయాలను ఆర్పి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్పటినుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కోవాలా మృతి చెందింది. దీంతో కన్నీటి పర్యంతమయ్యారు టోనీ డోహర్టీ.