‘ఇరాన్‌ నుంచి వెంటనే స్వదేశానికి వచ్చేయండి..’ భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచన

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచనలు చేసింది. ఇరాన్‌ నుంచి వెంటనే స్వదేశానికి రావాలని కోరింది. ఇరాన్‌ పర్యటనను రద్దు చేసుకోవాలని భారతీయులను కోరింది. నిరసనలతో ఉద్రిక్తంగా మారిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. నిత్యం తమతో టచ్‌లో ఉండాలని చెప్పింది. తాజా పరిస్థితులను గురించి తెలుసుకునేందుకు స్థానిక మీడియా వార్తలను జాగ్రత్తగా గమనిస్తుండాలని కూడా సూచించింది.

‘ఇరాన్‌ నుంచి వెంటనే స్వదేశానికి వచ్చేయండి..’ భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచన
Indian Embassy In Tehran New Advisory

Updated on: Jan 15, 2026 | 7:18 AM

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచనలు చేసింది. ఇరాన్‌ నుంచి వెంటనే స్వదేశానికి రావాలని కోరింది. ఇరాన్‌ పర్యటనను రద్దు చేసుకోవాలని భారతీయులను కోరింది. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉండడంతో విదేశాంగశాఖ కీలక సూచనలు జారీ చేసింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఉండాలని సూచించారు. ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు. ఇరాన్‌ పర్యటనను వాయిదా వేసుకోవాలని భారతీయులకు సూచించారు. తమకు అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల ద్వారా ఇరాన్‌ను వీడాలని పేర్కొన్నారు. నిరసనలతో ఉద్రిక్తంగా మారిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. నిత్యం తమతో టచ్‌లో ఉండాలని చెప్పింది. తాజా పరిస్థితులను గురించి తెలుసుకునేందుకు స్థానిక మీడియా వార్తలను జాగ్రత్తగా గమనిస్తుండాలని కూడా సూచించింది.

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటివరకు 2,500 మందికిపైగా చనిపోయారు. మరోవైపు.. నిరసనలు కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగశాఖ ఇప్పటికే ఓసారి పౌరులను అప్రమత్తం చేసింది. నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. అమెరికా ప్రభుత్వ మిడిల్‌ ఈస్ట్‌ లోని సైనిక స్థావరాలను ఖాళీ చేస్తోంది. ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు 75 దేశాల ప్రజలకు వీసాల జారీని అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది. రష్యా , ఇరాన్‌ , బ్రెజిల్‌ , ఆఫ్గనిస్తాన్‌ దేశస్తులకు అమెరికా వీసాల జారీని నిలిపివేసింది.

ఖతార్‌పై ఇరాన్‌ ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌లో ఉంటున్న భారతీయులు ఎల్లవేళలా తమ పాస్‌పోర్టు, ఐడీ, ఇతర ధ్రువీకరణ పత్రాలను రెడీగా పెట్టుకోవాలని కూడా భారతీయ ఎంబసీ పేర్కొంది. ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా భారతీయ ఎంబసీని సంప్రదించాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను కూడా ఎంబసీ షేర్ చేసింది. ఇక ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోని భారతీయులు వెంటనే నమోదు చేసుకోవాలని చెప్పింది ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవల్లో ఆటంకాల కారణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేకపోయిన వారు భారత్‌లోని తమ కుటుంబసభ్యుల సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఎంబసీ సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..