రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్… పంది, గొడ్డు మాంసంపై చర్చ… సభలోనే తన్నుకున్న పార్లమెంట్ సభ్యులు

|

Nov 27, 2020 | 8:45 PM

తైవాన్ పార్లమెంట్ పిడిగుద్దులకు వేదికైంది. ప్రజాస్వామ్యం అభాసుపాలైంది. పంది, గొడ్డు మాంసం దిగుమతిపై జరిగిన చర్య కాస్తా గొడవకు దారి తీసింది.

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్... పంది, గొడ్డు మాంసంపై చర్చ... సభలోనే తన్నుకున్న పార్లమెంట్ సభ్యులు
Follow us on

తైవాన్ పార్లమెంట్ పిడిగుద్దులకు వేదికైంది. ప్రజాస్వామ్యం అభాసుపాలైంది. పంది, గొడ్డు మాంసం దిగుమతిపై జరిగిన చర్య కాస్తా గొడవకు దారి తీసింది.

తైవాన్ పార్లమెంట్ వేదికగా అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై నవంబర్ 27న చర్చ మొదలైంది. గతంలో అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తైవాన్లో నిషేధం ఉండేది. అయితే ఇటీవల అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందంతో మాంసం దిగుమతిపై ఆ దేశం నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో పార్లమెంట్ వేదికగా పంది, గొడ్డు మాంసం దిగుమతి అంశం చర్యకు వచ్చింది. ఆ చర్చ కాస్తా తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై మరొకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పరస్పరం దాడులకు దిగారు. దీంతో పార్లమెంట్ ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది.

నివేదిక చదువుతున్న క్రమంలోనే…

అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం, పంది, గొడ్డు మాంసం దిగుమతిపై నివేదికను పార్లమెంట్ వేదికగా సెంగ్ చాంగ్ ఆ ఒప్పందాన్ని సభ్యులకు వివరిస్తుండగానే ప్రతిపక్ష పార్టీ సభ్యులు పంది మాంసంతో సభలోనికి రావడంతో పాటు, ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ చర్యను అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో పార్లమెంట్ లో ఘర్షణ వాతావరణం వేడెక్కింది. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు దిగారు. నేలపై పడి మరి కొట్టుకున్నారు. అయితే తైవాన్ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం పట్ల ఆ దేశంలోని పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి.