ఆ దేశంలోని రెస్టారెంట్లలో మాట్లాడకుండా తినాలి.. లేదంటే తీసుకెళ్లి జైళ్లో వేస్తారు.. కారణాలు ఇలా ఉన్నాయి..

|

Feb 22, 2021 | 5:49 AM

సాధారణంగా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్లకు ఎందుకు వెళుతారు.. ఏదైనా తినుకుంటూ ఫ్రీగా మాట్లాడుకోవడానికే కదా. కానీ జపాన్‌‌లో మాత్రం

ఆ దేశంలోని రెస్టారెంట్లలో మాట్లాడకుండా తినాలి.. లేదంటే తీసుకెళ్లి జైళ్లో వేస్తారు.. కారణాలు ఇలా ఉన్నాయి..
Follow us on

సాధారణంగా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్లకు ఎందుకు వెళుతారు.. ఏదైనా తినుకుంటూ ఫ్రీగా మాట్లాడుకోవడానికే కదా. కానీ జపాన్‌‌లో మాత్రం అలా కాదు. సైలెంట్‌గా తిని వచ్చిన పని చూసుకొని వెళ్లాలి. నిబంధనలు అతిక్రమించారో ఇక అంతే సంగతులు. అయితే ఆ దేశ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

జపాన్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కొన్ని నెలలపాటు రెస్టారంట్లు మూతపడగా.. ఈ మధ్యే తిరిగి తెరుచుకున్నాయి. ఈ రెస్టారంట్ల కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఎందుకంటే.. కరోనా వైరస్‌ గాలి ద్వారా సోకుతుందన్న విషయం తెలిసిందే. రోజంతా మాస్కులు ధరించే వ్యక్తులు తినే సమయంలోనే మాస్కులు తీసేస్తారు. తింటూ మాట్లాడుతున్నప్పుడు కరోనా వైరస్‌ గాల్లోకి చేరి ఇతరులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, కరోనా కట్టడిలో భాగంగా రాత్రి 8 గంటలకే రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, రెస్టారంట్లకు వెళ్లే ప్రజలు తినే సమయంలో మాట్లాడొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కాగా.. క్యోటో నగరం మాత్రం ఓ అడుగు ముందుకేసి ‘సైలెంట్‌ ఈటింగ్‌’పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా నాలుగు కార్టూన్లతో పోస్టర్‌ రూపొందించింది.

Raviteja: ఫుల్‌ జోష్‌ మీదున్న మాస్‌ మహారాజ.. వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకెళుతోన్న రవితేజ..