Malaria Mosquitoes: ఇరు దేశాలకు సవాల్ విసురుతోన్న దోమలు.. పట్టుకోవడానికి ట్రాకింగ్ పరికరాలు ఎందుకంటే..

|

Dec 18, 2024 | 8:38 PM

మలేరియా వ్యాధి నుంచి బయటపడటం దక్షిణ కొరియాకు కష్టంగా మారుతోంది. మీడియా కథనాల ప్రకారం ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆ దేశం ఇప్పుడు కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. ఉత్తర, దక్షిణ కొరియాలను వేరుచేసే భారీ కాపలా ఉన్న సరిహద్దు దగ్గర కొన్ని రకాల ట్రాకింగ్ పరికరాలు అమర్చబడ్డాయి. అయితే ఇవి మనుషులనో .. లేదా దేశ రక్షణ కోసమో కాదు.. మలేరియా వ్యాధిని కలిగించే దోమలను పట్టుకోవడానికి

Malaria Mosquitoes: ఇరు దేశాలకు సవాల్ విసురుతోన్న దోమలు.. పట్టుకోవడానికి ట్రాకింగ్ పరికరాలు ఎందుకంటే..
Malaria Mosquitoes
Follow us on

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల సరిహద్దు వద్ద భారీ కాపలా ఉంటుంది. ఈ సరిహద్దు దగ్గర దక్షిణ కొరియా 76 ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఈ పరికరాలు క్షిపణులను లేదా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కాదు. సరిహద్దు దాటి వచ్చే మలేరియా దోమలను పట్టుకోవడానికి ఈ పరికరాలను ఏర్పాటు చేసింది. ఈ విషయం వింతగా అనిపించవచ్చు. అయితే ఇది వాస్తవం. దీని వెనుక తీవ్రమైన కారణం ఉంది. దక్షిణ కొరియాలో దోమల ద్వారా సంక్రమించే తీవ్రమైన మలేరియా వ్యాధి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి ఆ దేశ ప్రజలకు ప్రధాన ఆరోగ్య సవాలుగా మారిపోయింది. AFP ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ సమస్యకు మూలం పొరుగు దేశం, శత్రు దేశమైన ఉత్తర కొరియా. ఆ దేశంలో మలేరియా ఇప్పటికీ ఒక సాధారణ వ్యాధి. ఉత్తర కొరియాలో పూర్తిగా నిర్మూలించబడలేదు. దీంతో పొరుగు దేశం సమస్య దక్షిణ కొరియాకు అతి పెద్ద సమస్యగా మారింది.

వాతావరణ మార్పు పెంచుతోన్న ముప్పు

దక్షిణ కొరియా కూడా ఈ ఏడాది దేశవ్యాప్తంగా మలేరియా వ్యాధి విషయంపై జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా దోమల ద్వారా వ్యాపించి వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. DW హిందీ నివేదిక ప్రకారం ఈ సమస్యపై ఉత్తర, దక్షిణ కొరియా కలిసి పనిచేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

మలేరియా రహిత దేశమని దక్షిణ కొరియా ఒకసారి ప్రకటించింది. అయితే 1993లో డిమిలిటరైజ్డ్ జోన్‌లో విధులను నిర్వహిస్తున్న ఒక సైనికుడికి ఈ మలేరియా వ్యాధి సోకింది. అప్పటి నుంచి ఈ వ్యాధి కొనసాగుతోంది. 2023లో కేసులు దాదాపు 80 శాతం పెరిగి 2022లో 420 నుంచి 747కి చేరుకున్నాయి.

ఇవి కూడా చదవండి

దోమలు 12 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలవు

రెండు దేశాల మధ్య అసలు సమస్య డిమిలిటరైజ్డ్ జోన్ అంటే DMZ. ఇది నాలుగు కిలోమీటర్ల వెడల్పు గల జనావాసాలు లేని భూభాగం. ఇది 250 కిలోమీటర్ల పొడవైన ఉమ్మడి సరిహద్దు వెంట ఈ భూభాగం ఉంటుంది. ఈ సైనికరహిత జోన్ ప్రాంతం దట్టమైన పచ్చని అడవులతో చుట్టుముట్టబడి ఉంది. ఈ భూమి మానవ నివాసానికి యోగ్యం కావు. ఎందుకంటే ఈ సరిహద్దు ప్రాంతం కొరియా యుద్ధ విరమణ తర్వాత 1953లో ఏర్పాటు చేయబడింది.

ల్యాండ్‌మైన్‌లతో నిండిన ఈ సరిహద్దు ప్రాంతం దోమలు వృద్ధి చెందడానికి ఉత్తమమైన వాతావరణాన్ని కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మలేరియాను వ్యాప్తి చేసే దోమలు కూడా ఉన్నాయి. ఇవి 12 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. గత దశాబ్దంలో దక్షిణ కొరియాలోని దాదాపు 90 శాతం మంది మలేరియా రోగులు DMZ సమీపంలోని ప్రాంతాల్లోని వారే అని అధికారిక డేటా ద్వారా తెలుస్తోంది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..