మృత్యుద్వీపం..! ప్రజలకు అంటువ్యాధి సోకిందని లక్షకుపైగా జనం సజీవ దహనం..చుట్టూ హాహాకారాలే..!

|

Mar 31, 2023 | 5:06 PM

ప్రభుత్వం 160,000 మంది బాధితులను ఇక్కడకు తీసుకువచ్చి సజీవ దహనం చేసింది. ఇది కాకుండా,బ్లాక్‌ ఫీవర్‌తో మరణించిన వ్యక్తులను కూడా ఈ ద్వీపంలో ఖననం చేశారు. ఒకప్పుడు ఇక్కడ ఒక ఆస్పత్రి కూడా ఉండేది. ఆ తర్వాత అది కూడా మూతపడింది.

మృత్యుద్వీపం..! ప్రజలకు అంటువ్యాధి సోకిందని లక్షకుపైగా జనం సజీవ దహనం..చుట్టూ హాహాకారాలే..!
Poveglia Island F
Follow us on

ప్రపంచంలో మనిషి తెలియని ఎన్నో రహస్యాలు, అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రదేశాలు చాలా ప్రమాదకరమైనవి. కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవిగా చెబుతారు. అక్కడి వెళ్లిన మనిషి తిరిగి ప్రాణాలతో రాలేడని అంటారు. ఈ ప్రపంచంలో అలాంటి దెయ్యాలు నివసించే ద్వీపం ఒకటి ఉంది. అక్కడి దెయ్యాల ప్రపంచంలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనిషి ఎముకలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లకూడదని ప్రభుత్వాలు కూడా సలహా ఇస్తున్నాయి. ఆ ప్రాంతంలో 1 లక్షా 60 వేల మంది సజీవ దహనమయ్యారని నివేదికలు చెబుతున్నాయి.

ఇటలీలోని పోవెగ్లియా ద్వీపంలో మృత్యువు నివసిస్తుందని, అక్కడికి వెళ్లిన వారు తిరిగి రారని చెబుతారు. ఈ ద్వీపానికి సంబంధించి ఒక భయానక కథనం ఉంది. అందుకే ఈ ద్వీపానికి వెళ్లడానికి ఎవరూ సాహసించరు. అయితే ధైర్యం చేసి వెళ్లిన వారిలో కొందరు తిరిగి రాలేక పోయారట. ఈ దీవి శాపగ్రస్తమైందని చెబుతుంటారు. వందల సంవత్సరాల క్రితం ఈ ద్వీపంలో లక్షన్నర ప్లేగు రోగులను సజీవ దహనం చేశారు. అందుకే ఈ ద్వీపాన్ని శాపగ్రస్తంగా భావిస్తారు. ఇకపోతే, ఎవరైనా ధైర్యం చేసిన వెళితే.. ఇక్కడ వింత స్వరాలు వినిపిస్తుంటాయని అక్కడికి వెళ్లినవారు చెబుతుంటారు. ఇక్కడికి వెళ్లే ప్రజలకు ఇటలీ ప్రభుత్వం కూడా హామీ ఇవ్వదు. అక్కడికి వెళ్లకుండా ఉండమని సలహా ఇస్తుంది.

ఇటలీలోని వెనిస్, లిడో మధ్య ఉన్న ఈ ద్వీపాన్ని గల్ఫ్ ఆఫ్ వెనిస్ అని కూడా పిలుస్తారు. ఈ ద్వీపం దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ సగం భూమి మానవ అవశేషాలతో నిండిపోయి ఉంటుందని చెబుతారు. ఇటలీలో ప్లేగు వ్యాపించినప్పుడు, ఇటలీ ప్రభుత్వం 160,000 మంది బాధితులను ద్వీపానికి తీసుకువచ్చి సజీవ దహనం చేసింది. ఇది కాకుండా,బ్లాక్‌ ఫీవర్‌తో మరణించిన వ్యక్తులను కూడా ఈ ద్వీపంలో ఖననం చేశారు. 1922లో ఈ ద్వీపంలో ఒక ఆస్పత్రిని నిర్మించారు. అయితే అది కూడా వెంటనే మూతపడింది. ఆసుపత్రి వైద్యులు, నర్సులకు ఇక్కడ చాలా అసాధారణమైన విషయాలు కనిపించాయని, వింత కదలికలు, వింత శబ్ధాలు వినిపించేవని వైద్యులు, నర్సులు తెలిపారు. ఆ తర్వాత ఈ ఆసుపత్రిని మూసివేశారని చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

Poveglia Island

1960వ సంవత్సరంలో ఒక ధనవంతుడు ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అయితే అతని కుటుంబం కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంది. కొంతకాలానికి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి దీనిని శాపద్వీపంగా పరిగణిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..