Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్- II 1986లో రాసిన లేఖ.. 2085 వరకు ఓపెన్ చేయకూడదు.. ఏముందో అందులో..

|

Sep 12, 2022 | 12:36 PM

Queen Elizabeth: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II మరణం పట్ల యావత్‌ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాల ప్రధానులు ఎలిజబెత్‌కు నివాళులు అర్పించారు. బ్రిటన్‌ను దీర్ఘకాలం పరిపాలించిన రాణితో తమకున్న...

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్- II 1986లో రాసిన లేఖ.. 2085 వరకు ఓపెన్ చేయకూడదు.. ఏముందో అందులో..
Queen Elizabeth 2
Follow us on

Queen Elizabeth: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II మరణం పట్ల యావత్‌ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాల ప్రధానులు ఎలిజబెత్‌కు నివాళులు అర్పించారు. బ్రిటన్‌ను దీర్ఘకాలం పరిపాలించిన రాణితో తమకున్న సాన్నిహిత్యాన్ని పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎలిజబెత్‌ మరణానంతరం ఆమెకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలపై చర్చ జరుగుతోంది. ఆమె ధరించే క్యాప్‌ నుంచి ఆమె జీవనశైలి వరకు ప్రతీ అంశం ఆసక్తికరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే క్వీన్‌ ఎలిజబెత్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఎలిజబెత్ రాణి రాసిన రహస్య లేఖ ఒకటి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. బ్రిటన్‌ రాణి రాసిన రహస్య లేఖను ఒక సీక్రెల్‌ లాకర్‌లో ఉంచారు. ఈ లాకర్‌ ఆస్ట్రేలియాలోని చారిత్రాత్మక క్వీన్‌ విక్టోరియా భవనంలో ఉంది. లాకర్‌ తెరిచి లెటర్‌లో ఏముందో చూస్తే సరిపోతుంది కదా.. సీక్రెట్‌ ఏముంది అంటారా.? అయితే ఈ లాకర్‌ను మరో 63 ఏళ్లు తెరవకూడదనే నిబంధన ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన మీడియా సంస్థ 7న్యూస్‌ కథనం ప్రకారం.. 1986లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఎలిజబెత్ ఆ సమయంలో తన పర్యటనకు సంబంధించి ఓ లేఖ రాశారు. ఆ లేఖ రాసి ఇప్పటికీ 36 ఏళ్లు పూర్తవుతుంది. మరో 63 ఏళ్ల తర్వాత అంటే 2085లో ఆ లేఖను తెరవాలని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సిడ్నీ రైట్ అండ్ హానరబుల్ లార్డ్ మేయర్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో ఆమె సంతకం కూడా ఉంది. ఇక ఆ లేఖపైన ఎలిజబెత్..’నమస్కారాలు! 2085 A.Dలో మీకు ఎంపిక చేసుకున్న తగిన రోజున దయచేసి ఈ కవరు తెరిచి సిడ్నీ పౌరులకు నా సందేశం తెలియజేయండి’ అని రాశారు. దీంతో అసలు ఆ లేఖలో ఏ సందేశం ఉండొచ్చు. ఉంటే దాదాపు 100 ఏళ్ల తర్వాతే ఎందుకు ఓపెన్‌ చేయమన్నట్లు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే బ్రిటన్‌ రాణి తన జీవిత కాలంలో మొత్తం 16 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..