King Charles Coronation: 80 ఏళ్ల తర్వాత బ్రిటన్ రాజు పట్టాభిషేకం.. వెయ్యి సంవత్సరాల సింహాసనంపై 300 ఏళ్ల నాటి కిరీటం ధరించి..!

|

May 06, 2023 | 6:44 PM

భారతదేశం తరపున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌, ఆమె మనవరాలు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యూల్‌ మెక్రాన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలెనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులు, రాజకుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తులు, ప్రత్యేకమైన టోపీలు ధరించారు.

King Charles Coronation: 80 ఏళ్ల తర్వాత బ్రిటన్ రాజు పట్టాభిషేకం.. వెయ్యి సంవత్సరాల సింహాసనంపై 300 ఏళ్ల నాటి కిరీటం ధరించి..!
King Charless Investiture C
Follow us on

బ్రిటన్‌ మహారాజుగా చార్లెస్‌ పట్టాభిషిక్తులయ్యారు. లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ అబీలో పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో చార్లెస్‌ బ్రిటన్‌ మహారాజుగా కిరీటాన్ని ధరించారు. దాదాపు వెయ్యి ఏళ్ల నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి పట్టాభిషేకాన్ని నిర్వహించారు. 70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో నిర్వహిస్తున్న పట్టాభిషేక మహోత్సవం కావడంతో లండన్‌ వీధులన్నీ సంబరాల్లో మునిగితేలాయి. బ్రిటన్‌ జాతీయ గీతం గాడ్‌ సేవ్‌ ది కింగ్‌ ఆలాపన మధ్య సంప్రదాయ దుస్తులు ధరించి 14వ శతాబ్దపు సింహసనంపై ఆసీనుడైన చార్లెస్‌ తలపై భారతీయ కాలమాన ప్రకారం సరిగ్గా సాయంత్రం నాలుగున్నర గంటలకు క్యాంటర్‌బరీ ఆర్చ్‌బిషన్‌ జస్టిన్‌ వెల్‌బీ సెయింట్‌ ఎడ్వర్డ్స్‌ కిరీటాన్ని ఉంచారు. 1661లో ఈ ప్రత్యేకమైన కిరీటాన్ని తయారు చేయించారు. గడిచిన 360 సంవత్సరాల్లో కేవలం ఆరుగురు రాజులు మాత్రమే ధరించారు. 1937లో బ్రిటన్‌లో ఒక రాజుకు జరిగిన పట్టాభిషేకం ఇది. ఈ కిరీటాన్ని ధరించిన మొట్టమొదటి అతి పెద్ద వయస్సు వ్యక్తి చార్లెస్‌. రాజుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజదండం, క్రాస్‌తో కూడిన బింబాన్ని చార్లెస్‌ అందుకున్నారు.

చార్లెస్‌ పట్టాభిషేకం పూర్తైన తర్వాత నిరాండబరంగా నిర్వహించిన కార్యక్రమంలో క్యామిల్లా కిరీటధారణ జరిగింది. ఆమె ధరించే కిరీటం పేరు క్వీన్‌ మేరీ క్రౌన్‌ ఇది 600 గ్రాములు బరువు ఉంటుంది. ఇందులో 2,200 వజ్రాలు పొదిగి ఉన్నాయి. బ్రిటీష్‌ డిజైనర్‌ బ్రూస్‌ ఓల్డ్‌ఫీల్డ్‌ వెండి, బంగారు పూల ఎంబ్రాయిడరీతో తయారు చేసిన దంతపు గౌనుపై 1953లో జరిగిన ఎలిజబెత్‌ పట్టాభిషేకంలో ధరించిన గౌనును పట్టాభిషేక సమయంలో క్యామిల్లా ధరించారు.

అంతకు ముందు కింగ్ చార్లెస్‌, క్వీన్ క్యామిల్లా ఆరు గుర్రాలు లాగే డైమండ్‌ జూబ్లీ స్టేట్‌ కోచ్‌లో వెస్ట్‌మినిస్టర్‌ అబీకి వచ్చారు. రాజ సైనికులు కవాతుగా ముందు నడుస్తుండగా దారి పొడవునా ప్రజలు రాజు, రాణికి అభివాదం చేశారు. పట్టాభిషేకం కోసం వెస్ట్‌ మినిస్టర్‌ అబీ చేరుకున్న చార్లెస్‌ – తాను సేవలు పొందడానికి కాదు సేవ చేసేందుకు వచ్చానని ప్రకటించారు. మరో వైపు చార్లెస్‌ పట్టాభిషేకం సందర్భంగా లండన్‌ సహ బ్రిటన్‌లోని 13 ప్రాంతాల్లో గన్‌ సెల్యూట్‌ సమర్పించారు. దాదాపు 2300 మంది ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారతదేశం తరపున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌, ఆమె మనవరాలు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యూల్‌ మెక్రాన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలెనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులు, రాజకుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తులు, ప్రత్యేకమైన టోపీలు ధరించారు. చాలా మంది ఎరుపు రంగు దుస్తులు ధరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..