Kim Jong Un: కష్టాల్లో నార్త్ కొరియా.. కిమ్ ఇలాకాలో అరడజన్ అరటిపండ్లు రూ. 3 వేలు!

Kim Jong Un: ఒక టీ ప్యాకెట్ ధర రూ. 5 వేలు, కాఫీ ప్యాకెట్ రూ. 7 వేలు, ఏడు అరటి పండ్లు రూ. 3 వేలు.. ఏంటీ ఈ ధరలు.! ఎవరైనా కొనుగోలు చేయగలరా..

Kim Jong Un: కష్టాల్లో నార్త్ కొరియా.. కిమ్ ఇలాకాలో అరడజన్ అరటిపండ్లు రూ. 3 వేలు!
Kim Jong-un

Updated on: Jun 19, 2021 | 9:02 AM

ఒక టీ ప్యాకెట్ ధర రూ. 5 వేలు, కాఫీ ప్యాకెట్ రూ. 7 వేలు, ఏడు అరటి పండ్లు రూ. 3 వేలు.. ఏంటీ ఈ ధరలు.! ఎవరైనా కొనుగోలు చేయగలరా అని అనుకుంటున్నారా.? ఇవన్నీ కూడా కిమ్ ఇలాకాలో తాజా ధరలు. ప్రస్తుతం నార్త్ కొరియా ఆహార సంక్షోభంలో ఉంది. అక్కడ ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి.

సరిహద్దుల్లో ఆంక్షలు, వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టం వల్ల నార్త్ కొరియాలో ఊహించని విధంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తమ దేశం ఆహార కొరతను ఎదుర్కుంటోందని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాలకు బలం చేకూరుస్తున్నాయి.

దేశం ఆహార కొరతను ఎడుర్కుంటోందని.. వెంటనే ఆహారోత్పత్తి పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని తాజాగా జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కిమ్ అధికారులను ఆదేశించాడు. ఇక ఇంత సంక్షోభంలో ఉన్నా కూడా.. కోవిడ్ ఆంక్షలను మాత్రం మరికొన్ని రోజులు పొడిగించాలని కిమ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కిమ్ తాజాగా తీసుకొచ్చిన కొత్త చట్టాలు..

కిమ్ ఇటీవలే కొన్ని నూతన చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారం.. ఆ దేశంలోని ప్రజలెవ్వరూ కూడా జుట్టుకు రంగు వేయకూడదు. అంతేకాకుండా కిమ్ సూచించిన 215 హెయిర్ కట్స్‌కు మాత్రమే ఫాలో కావాలి. మిగతా దేశాలకు సంబంధించిన స్టైల్స్‌, వస్త్రాధారణను పౌరులు అస్సలు అనుసరించకూడదు. చిరిగిపోయిన జీన్స్, టీ షర్ట్స్‌లను యువత వేసుకోకూడదని.. అలాగే ముక్కు, పెదాలపై రింగులు ఉండకూడదని కిమ్ ఆదేశించారు. అటు సౌత్ కొరియా సినిమాలు, సంగీతం, వీడియోలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కఠిన శిక్షకు అర్హులు.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!