Australia Elections: సాధారణంగా ఒక దేశంలో ఎన్నికలు జరుగుతుంటే మరో దేశ అధ్యక్షుడు ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది.. అంత ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ.. వేరే దేశ అధ్యక్షుడు ఇలా ప్రచారం చేయడం ఏంటని అనుకుంటారు. ఇక ఆస్ట్రేలియా ఎన్నికల ప్రచారంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్–ఉన్ (Kim Jong Un) సందడి చేస్తున్నాడు. కానీ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన నిజమైన కిమ్ కాదని దమ్మీ అని తెలుసుకొని.
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం అక్కడి పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.. అయితే అచ్చం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మాదిరిగానే ఉన్న ఓ వ్యక్తి అక్కడ సందడి చేస్తున్నాడు. ఈయన అసలు పేరు హువార్డ్ ఎక్స్ చిషోల్మ్.. అచ్చం కిమ్ లాగే హావభావాలను ప్రదర్శిస్తూ అందరికీ ఆకట్టుకుంటున్నాడు.. చిషోల్మ్ ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కి తలనొప్పిగా మారాడు.
మెల్‌బోర్న్‌లో జరిగిన స్కాట్ మోరిసన్ ఎన్నికల ప్రచార ర్యాలీకి వచ్చి ఇబ్బందులు సృష్టించాడు ఈ నకిలీ కిమ్ జోంగ్.. మోరిసన్‌కు చెందిన లిబరల్ నేషనల్ కూటమి-లేబర్ పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఎన్నికల్లో విజయావకాశాలు లేబర్ పార్టీకే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో మోరిసన్‌కు ఓటేస్తే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు వేసినట్లే అని చిషోల్మ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి..
హువార్డ్ ఎక్స్ చిషోల్మ్ చేస్తున్న ఈ రకమైన ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రధాని మోరిసన్ ప్రచార బృందం.. అయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచింది. పోలీసులు ఈ నకిలీ కిమ్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిషోల్మ్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదు. కాగా ఈ డమ్మీ కిమ్ 2018నాటి అమెరికా- నార్త్‌కొరియా సదస్సు సందర్భంగా కూడా కనిపించాడు. అప్పటి నుంచే అందరి దృష్టిలో పడ్డాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి