Kim Jong Un: లేడీ న్యూస్‌రీడర్‌కు బంపర్‌ ఆఫర్ ఇచ్చిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌.. ఎందుకో తెలుసా?

|

Apr 14, 2022 | 9:39 PM

Kim Jong Un: ఉత్తర కొరియా అధిపతి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారాయన.

Kim Jong Un: లేడీ న్యూస్‌రీడర్‌కు బంపర్‌ ఆఫర్ ఇచ్చిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌.. ఎందుకో తెలుసా?
Kim Jong Un
Follow us on

Kim Jong Un: ఉత్తర కొరియా అధిపతి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారాయన. ప్రస్తుతం వరుస మిసైల్‌ టెస్ట్‌లతో అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పట్టిస్తోన్న కిమ్‌ తాజాగా ఓ న్యూస్‌ రీడర్‌కు విలాసవంత భవనం బహుమతిగా అందజేసి ఆశ్చర్యపరిచారు. ఆదేశ అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌(కేసీటీవీ)కి గత కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తోన్న 79 ఏళ్ల రీ చున్‌ హైకి ఆయన ఈ ఖరీదైన బంగ్లాను అందజేశారు. 1970ల ప్రారంభంలో కిమ్‌ ఇల్‌ సంగ్‌ హయాంలో విధుల్లో చేరిన ఆమె గత 50 ఏళ్లకు పైగా ప్రభుత్వ ప్రసారాలకు గొంతుకగా పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేశాధినేతలకు సంబంధించిన వ్యవహరాలు, అణు, క్షిపణి పరీక్షలు తదితర ప్రధాన సంఘటనలను ప్రజలను చేరవేశారు. రీ చున్‌ సేవలకు గుర్తింపుగానే ఆమెకు విలాసవంతమైన భవనాన్ని కిమ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారని తెలుస్తోంది.

ఆమె సేవలకు గుర్తింపుగా..

తాజాగా ప్యోంగ్యాంగ్‌లో కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇంటి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిమ్ కూడా హాజరయ్యారు. రీచున్‌తో కలిసి ఇల్లంతా కలియదిరిగారు. ఈ సందర్భంగా మెట్లు ఎక్కేటప్పుడు, దిగే సమయంలో ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెయ్యి పట్టుకుని నడిపించారు. ఆరోగ్యంగా ఉండాలని, తన వర్కర్స్ పార్టీ పాలనాస్వరాన్ని గట్టిగా వినిపించాలని కిమ్‌ ఆమెను కోరినట్లు తెలుస్తోంది. ఆమె సైతం తన కొత్త ఇల్లు.. ఒక ఖరీదైన హోటల్‌లా ఉందని భావించారని, కిమ్‌ పట్ల కృతజ్ఞతతో ఆమె కుటుంబ సభ్యులందరూ రాత్రంతా మేల్కొనే ఉన్నారని న్యూస్‌ ఏజెన్సీలు తెలిపాయి. కాగా కరోనా మహమ్మారి కష్టాలు, దౌత్య ప్రతిష్టంభనలతో దేశం సతమతమవుతోన్న వేళ.. ప్రజల నుంచి మద్దతు కూడగట్టేందుకు కిమ్‌ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఈ ఖరీదైన బహుమతిని అందజేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రీ చున్ హై ఇందుకు స్పష్టమైన ఉదాహరణని.. ఆమె కిమ్‌ అణు, క్షిపణి పరీక్షలను బలంగా ప్రచారం చేశారని వారు చెబుతున్నారు.

Also Read: BR Ambedkar Jayanti: తల్లిదండ్రులకు 14వ సంతానం అంబేద్కర్… ఫ్యామిలీ ముఖ్యమైన విశేషాలు మీకోసం

BR Ambedkar Jayanti: తల్లిదండ్రులకు 14వ సంతానం అంబేద్కర్… ఫ్యామిలీ ముఖ్యమైన విశేషాలు మీకోసం

Eesha rebba: దేవకన్య కూడా నీ అందం ముందు దిగదుడుపే.. అందాల ఈషా..