Katya echazarreta: ఆమె ఓ చరిత్ర..! మెక్‌డొనాల్డ్ ఉద్యోగం నుండి అంతరిక్ష ప్రయాణం వరకు.. 26 ఏళ్ల ఇంజనీర్ కథ

|

Jun 09, 2022 | 6:32 PM

అమెరికాకు చెందిన 26ఏళ్ల ఇంజనీర్ కాట్యా ఎచాజరెటా (Katya Echazarreta)అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మెక్సికన్‌లో జన్మించిన మహిళగా చరిత్ర సృష్టించారు. కానీ, ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం మెక్‌డొనాల్డ్స్‌లో పని చేసింది.. కానీ, ఇప్పుడు..

Katya echazarreta: ఆమె ఓ చరిత్ర..! మెక్‌డొనాల్డ్ ఉద్యోగం నుండి అంతరిక్ష ప్రయాణం వరకు.. 26 ఏళ్ల ఇంజనీర్ కథ
Katya Echazarreta
Follow us on

మెక్సికోలో జన్మించిన ఆమె 7 ఏళ్ళ వయసులో USకి వచ్చింది. తన తల్లిదండ్రులకు దూరంగా 5 సంవత్సరాలు గడిపింది. తన కుటుంబానికి మద్దతుగా మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేసింది. ఇప్పుడు 26 ఏళ్ల కాట్యా ఎచాజరెటా(Katya Echazarreta) బ్లూ ఆరిజిన్ NS-21 మిషన్‌లో భాగం అవుతుంది. సిటిజన్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మెక్సికన్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. ఆమె UCLAలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను అభ్యసించింది. తరువాత జాన్స్ హాక్‌పిన్స్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించింది. YouTubeలో “నెట్‌ఫ్లిక్స్ ఐఆర్ఎల్” మరియు “ఎలక్ట్రిక్ క్యాట్” షోల హోస్ట్‌లలో కాత్య కూడా ఒకరు, ఇక్కడ ఆమె టీవీ సిరీస్‌లలో మనం చూసే వాటికి శాస్త్రీయ ధృవీకరణను నిర్వహిస్తుంది. కటియా NASA యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో నాలుగు సంవత్సరాలు పనిచేసింది-ఆమె ఐదు వేర్వేరు అంతరిక్ష యాత్రలలో పాల్గొంది. మరింత లోతుగా విశ్లేషిస్తే…

అమెరికాకు చెందిన 26ఏళ్ల ఇంజనీర్ కాట్యా ఎచాజరెటా (Katya Echazarreta)అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మెక్సికన్‌లో జన్మించిన మహిళగా చరిత్ర సృష్టించారు. జూన్ 4న అంతరిక్షంలోకి బయలుదేరిన బ్లూ ఆరిజిన్‌కు చెందిన పర్యాటక అంతరిక్ష విమానం ఎక్కిన ఆరుగురిలో ఆమె కూడా ఉన్నారు. స్పేస్ ఫర్ హ్యుమానిటీ అనే NGO ద్వారా ఈ యువ ఇంజనీర్‌ను ఫ్లైట్ కోసం ఎంచుకున్నారు. దీని లక్ష్యం అంతరిక్షంలోకి “అసాధారణమైన నాయకులను” పంపడం. ఎచజారెటా కూడా నిజంగానే అసాధారణమైన యువ ఇంజనీర్‌. ఆమె నాసాతో టెస్ట్ లీడ్‌గా పనిచేసింది. ఆమె స్వంత టాక్ షోను కూడా నిర్వహిస్తోంది.

మెక్సికోలోని జలిస్కో ప్రాంతంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కాట్యా ఎచాజరెటా ఏడేళ్ల వయసులో యుఎస్‌కి వచ్చింది. అయితే వలసదారుల ప్రక్రియ కారణంగా కాట్యా ఐదు సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. 18 సంవత్సరాల వయస్సులో, ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి మెక్‌డొనాల్డ్స్‌లో పని చేయడం ప్రారంభించింది. అయితే, కాట్యాకు చిన్నప్పటి నుంచి అంతరిక్షం (Space), సైన్స్‌ అంటే విపరీతమైన ఆసక్తి. ఆ ఇష్టంతోనే ఎలక్ట్రిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి నాసాలో జెట్‌ ప్రొపెల్షన్‌ లేబొరేటరీలో చేరింది. అక్కడ అనేక స్పేస్‌ మిషన్లలో పనిచేసింది. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి జాన్స్‌ హాక్పిన్స్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రిక్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో ఎచజారెటా మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది.

ఇవి కూడా చదవండి

అంతరిక్షంలోకి ఇంజనీర్ ప్రయాణం ఆమెకు జీవితంపై కొత్త దృక్పథాన్ని తెచ్చిపెట్టింది. తనతో పాటుగానే తనలాంటి మరెందరో ఇలాంటి అనుభవాల్ని చవిచూడాలని ఆమె కోరుకుంటోంది. మెక్సికో నుంచి వచ్చిన మొదట్లో తన దేశం గురించి తెలిసి చాలా మంది తన పట్ల అవహేళన మాట్లాడిన సందర్బాలను ఆమె గుర్తుకుచేసుకుంది. అమ్మాయిలు అంతరిక్షానికా అని ఎగతాళి చేసిన వారికి ఇప్పుడు తను సాధించిన విజయమే సమాధానం అంటోంది. తను తిరిగి వచ్చిన తర్వాత వాళ్లందరినీ చూడాలని ఉందన్నారు. మీతో పాటు ఎదగడానికి ఇతరులకు సహాయం చేయకపోతే మీ లక్ష్యాలను సాధించినా అది వృధాయే అంటోంది కాట్యా. అదే నేను నమ్ముతానిని చెబుతోంది. కాట్యా, మరో ఐదుగురితో కలిసి శనివారం బ్లూ ఆరిజిన్‌ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.

కాట్యా, మరో ఐదుగురితో కలిసి శనివారం బ్లూ ఆరిజిన్‌ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. వీరంతా అంతరిక్షం కొనకు వెళ్లి అక్కడ 10 నిమిషాల పాటు ఉండి తిరిగి భూమికి చేరుకోనున్నారు. మూడు నిమిషాల పాటు గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఉండనున్నారు. మరో మూడు నిమిషాల పాటు భూమి అద్భుత దృశ్యాలను చూడనున్నారు.