కాబూల్‌లో పేలుడు.. జర్నలిస్టుతో సహా ముగ్గురు మృతి

|

Nov 07, 2020 | 5:24 PM

అఫ్ఘనిస్థాన్ దేశం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తాజాగా కాబూల్ నగరంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఓ జర్నలిస్టుతో సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు.

కాబూల్‌లో పేలుడు.. జర్నలిస్టుతో సహా ముగ్గురు మృతి
Follow us on

అఫ్ఘనిస్థాన్ దేశం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తాజాగా కాబూల్ నగరంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఓ జర్నలిస్టుతో సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. కాబూల్ నగరంలో శనివారం ఉదయం 7.30 గంటలకు దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడు ఘటనలో టోలో న్యూస్ లో జర్నలిస్టుగా పనిచేసిన యమా శియావాష్ అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. కాగా, మాజీ జర్నలిస్టుతో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకొని మాగ్నటిక్ మందుపాతరను పేల్చారు. ఈ పేలుడులో మాజీ జర్నలిస్టుతోపాటు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ పేలుడు ఘటనకు ఎవరు పాల్పడ్డారనేది ఎవరూ ప్రకటించలేదు. ప్రమాద అనంతరం ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఈ పేలుడు ఘటనతో కాబూల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు గల కారణాలపై కాబూల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్ఘనిస్థాన్ దేశంలో తరచూ పేలుళ్లు జరుగుతుండటంతో ఇక్కడి ప్రజలు కలవరపడతున్నారు.