Jordan parliament: అదోక పార్లమెంట్.. సహజంగా ప్రభుత్వ, విపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు సర్వసాధారణం.. ఈ క్రమంలో ఆందోళనలు, ఆరోపణలు, వాగ్వాదాలు పరిపాటి.. అయితే.. ఒక్కొసారి హుందాగా వ్యవహరించాల్సిన సభలో కొందరు విచక్షణ కొల్పోయి ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఘటనే జోర్డాన్ పార్లమెంట్‌లో చోటుచేసుకుంది. హుందాగా ఉండే ఎంపీలు.. ఒక్కసారిగా బాహాబాహికి దిగారు. విచక్షణ కోల్పోయి గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ సంఘటన పెనుదుమారం రేపింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలే ఇలా పిడిగుద్దుల వర్షం కురిపించుకుంటే ఎలా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల జోర్డాన్ పార్లమెంటులో రాజ్యాంగ సంస్కరణల గురించి చర్చ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దేశ రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంపీలు ఒకరినొకరు కొట్టుకుంటూ, దూషించుకుంటూ కనిపించారు. జోర్డానియన్ల విధులు, హక్కులపై రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ ఈ సవరణను తప్పుపట్టారు. ఈ బిల్లు పనికిరాదంటూ అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పార్టీ ఎంపీల ప్రతి విమర్శలకు దిగారు. సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Several deputies traded punches in a brawl in Jordan’s parliament after a verbal row escalated when the assembly speaker called on a deputy to leave, witnesses said https://t.co/4WVq2L1Div pic.twitter.com/RqA04SZHeY
— Reuters (@Reuters) December 28, 2021
జోర్డాన్ రాజ్యాంగంలోని పౌరులందరికీ సమాన హక్కులకు హామీ ఇచ్చే చట్టంలో ప్రత్యేకంగా మహిళల పేరును జోడించడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇది లింగ వివక్షకు దారి తీస్తుందని.. ఈ ముసాయిదా సవరణను నిలిపివేయాలని సూచిస్తున్నారు. ఈ చర్చ సందర్భంగా ఎంపీలు చొక్కాలు పట్టుకొని ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
Also Read: