Ruby Roman Grapes: ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ద్రాక్ష.. ఒక గుత్తి ధర వేలల్లో.. ఎక్కంటే

Ruby Roman Grapes: మన దేశంలో కిలో ద్రాక్ష ఎంత ధర ఉంటుంది అంటే..సీజన్ బట్టి.. ద్రాక్షలోని రకాలను బట్టి.. రూ. 100 నుంచి రూ. 200 వరకూ ఉండొచ్చు అని అంటారు. ప్రాంతాన్ని బట్టి.. ధరలు కొంచెం..

Ruby Roman Grapes: ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ద్రాక్ష.. ఒక గుత్తి ధర వేలల్లో.. ఎక్కంటే
Ruby Roman Grapes

Updated on: Sep 23, 2021 | 9:30 AM

Ruby Roman Grapes: మన దేశంలో కిలో ద్రాక్ష ఎంత ధర ఉంటుంది అంటే..సీజన్ బట్టి.. ద్రాక్షలోని రకాలను బట్టి.. రూ. 100 నుంచి రూ. 200 వరకూ ఉండొచ్చు అని అంటారు. ప్రాంతాన్ని బట్టి.. ధరలు కొంచెం అటుఇటు ఉండొచ్చు.. అయితే ఇప్పుడు జీవించే విధానంలోనే కాదు.. తినే తిండిలో కూడా ఆధునిక హంగులు.. దర్జా దర్పం కనిపించేలా చూసుకుంటున్నారు. అందుల్లనే విలాసవంతమైన ఆహారం , పానియాలను ఫుడీస్ ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో స్వచ్ఛమైన బంగారం పూతను ఉపయోగించిన వంటలు ప్రసిద్ధి చెందాయి. ; బిర్యానీ, ఐస్ క్రీం,  వడ పావ్ ఇలా అనేక ఆహారపదార్ధాలు అత్యంత ఖరీదైనవిగా తయారు చేస్తున్నారు. అయితే ఈ కోవలోకి ఇప్పుడు ప్రకృతి ప్రసాదిత ఆహారమైన ద్రాక్ష కూడా చేరింది. ఆ దేశంలోని ద్రాక్ష ఒక గుత్తి.. మన దేశ కరెన్సీలో ముఫై వేలకు ధర పలుకుతుందట.. వివరాల్లోకి వెళ్తే..

జపాన్‌లో  రూబీ రోమన్‌ ద్రాక్ష రకాన్ని పండిస్తున్నారు. ఈ ద్రాక్ష గుత్తి  రూ. 30 నుండి 35 వేల ధర పలుకుతోందట.  ఈ ద్రాక్ష మాములు ద్రాక్ష కంటే నాలుగు రేట్లు పెద్దదిగా ఉండటం కూడా దీని ప్రత్యేకతే. అంతేకాదు ఈ ద్రాక్ష రంగు, రుచిలో విభిన్నంగా ఉంటుంది. ఇక రూబీ  రోమన్ ద్రాక్ష చాలా అరుదుగా దొరకడం వల్ల కూడా దీనికి అంత డిమాండ్‌ ఏర్పడింది.  ద్రాక్షగుత్తిలో ఒక్కో పండు కనీసం 20 గ్రాముల బరువు, 30 మి.మీ. పరిమాణం ఉంటుందట. ఇక 2020లో ఓ గుత్తిని అమ్మితే రూ. 8.8 లక్షల వరకు ( 12వేల డాలర్లు) పలికిందట. తాజాగా ఇప్పుడు కూడా ఈ ద్రాక్ష అధిక ధరకు అమ్ముడై తన ఘనతను కొనసాగిస్తుంది. అవును జపాన్‌లో మాత్రమే పండే రూబీ రోమన్‌ రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ ద్రాక్ష అత్యంత విలాసవంతమైనది,  ఖరీదైనదిగా ఖ్యాతిగాంచింది.

 

Also Read: Flax Seed-flax leaves: చర్మం సౌందర్యాన్ని పెంచి.. అందం, ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధాల గని ‘అవిసె’ మొక్క..

Yoga Pose-Pregnent Women: గర్భిణీ స్త్రీలల్లో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంత కోసం.. సుఖ ప్రసవం కోసం యోగాసనాలు ఏమింటే..