Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. ఉగ్రనేత మసూద్‌ అజహర్‌ కుటుంబం మొత్తం మటాష్.. 10 మందికి పైగా..

భారత సైన్యం దాడిలో మసూద్‌ అజహర్‌ కుటుంబంలో పదిమంది మృతి చెందారు. మసూద్‌ అజహర్‌ కుటుంబం సర్వనాశనమైంది. జైషే మహ్మద్‌ చీఫ్‌ సన్నిహితులు నలుగురు మృతి చెందారు. మృతులంతా స్వర్గానికి వెళ్తారంటూ పేర్కొన్న మసూద్‌ అజహర్‌ .. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ పేర్కొన్నాడు..

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. ఉగ్రనేత మసూద్‌ అజహర్‌ కుటుంబం మొత్తం మటాష్.. 10 మందికి పైగా..
Terrorist Masood Azhar

Updated on: May 07, 2025 | 12:55 PM

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం పాకిస్తాన్ పై దిమ్మతిరిగిపోయేలా ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రస్థావరాల లెక్కలు తీసి.. టార్గెట్ చేసి మరీ భారత్ దాడులు చేసింది.. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్‌ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్‌ ముగిసాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్‌ చేసింది. కేవలం 25 నిమిషాల్లోనే భారత్ ఆపరేషన్ సింధూర్‌ ను విజయవంతంగా ముగించింది. ఆపరేషన్ సింధూర్‌ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోదీ. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించారు. కాగా.. ఈ ఆపరేషన్ సింధూర్ లో కీలక ఉగ్రవాదులు సహా.. దాదాపు 100 మంది హతమైనట్లు పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5.. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో మిస్సైళ్ల వర్షం కురిపించింది.

భారత్‌ ఎటాక్‌తో పాకిస్తాన్‌ గడ్డపై ఉగ్రమూకలు ఛిన్నాభిన్నమయ్యాయి.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ తగిన మూల్యం చెల్లించుకున్నారు. భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌పై మసూద్‌ అజహర్‌ తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు.

భారత సైన్యం దాడిలో మసూద్‌ అజహర్‌ కుటుంబంలో పదిమంది మృతి చెందారు. మసూద్‌ అజహర్‌ కుటుంబం సర్వనాశనమైంది. జైషే మహ్మద్‌ చీఫ్‌ సన్నిహితులు నలుగురు మృతి చెందారు. మృతులంతా స్వర్గానికి వెళ్తారంటూ పేర్కొన్న మసూద్‌ అజహర్‌ .. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ తెలిపారు..పాపిచిరాయువులా ఇంకా బతికే ఉన్న మసూద్‌ అజహర్‌.. చింతచచ్చినా పులుపు చావని విధంగా మాట్లాడటం హాస్యాస్పదంగా మారింది. మసూద్‌ అజహర్‌ తప్ప కుటుంబమంతా మటాష్‌ కావడం.. అలాగే.. భారత్ ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని.. మిగిలిన ఉగ్రమూకలు భయం భయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బహావల్‌పూర్‌ ఉగ్రవాద శిబిరం.. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ హెడ్‌క్వార్టర్‌ ఇదే.. పుల్వామా, పార్లమెంట్‌పై దాడి వెనుక జైష్‌ హస్తం ఉంది.. బహావల్‌ పూర్ అనేది పాక్‌లో 12వ అతిపెద్ద నగరం.. ఇక్కడున్న జామియా మసీద్‌ సుభాన్ అల్లా కాంప్లెక్స్‌ నుంచి జైషే మహమ్మద్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీనికే ఉస్మాన్‌ ఓ-అలీ క్యాంపస్‌ అని పేరు ఉంది.. దాదాపు 18 ఎకరాల్లో ఈ టెర్రర్‌ క్యాంప్‌ ఉంది.. ఈ జైషే మదర్సాలో 600 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చారని.. ఈ ఉగ్రశిబిరంలో దాదాపు 30 మంది మరణించినట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..