500ఏళ్లుగా చర్చిలో వేలాడుతున్న మృతదేహం.. ! దాని వెనుక రహస్యం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

|

Feb 23, 2024 | 5:21 PM

అయితే, ఇక్కడి చర్చి పైన మీరు చూసే ఈ మొసలి బొమ్మ అనుకునేరు.. కాదు.. ఇది నిజమైన మొసలి. ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం వేయబడిందని చెబుతారు. ఈ చర్చి 13వ శతాబ్దానికి చెందినది. ఈ మొసలి వెనుక అనేక కథనాలు, ఇతిహాసాలు అక్కడి చుట్టూ పక్కల ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో రెండు కథలు ఎక్కువ ప్రసిద్ధి చెందాయి.

500ఏళ్లుగా చర్చిలో వేలాడుతున్న మృతదేహం.. ! దాని వెనుక రహస్యం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Crocodile In The Church
Follow us on

ప్రపంచంలోని అనేక ప్రదేశాలు వింత కారణాలతో వార్తల్లో నిలుస్తుంటాయి. అలాంటి వాటిల్లో చర్చి ఆఫ్ ఇటలీ కూడా ఒకటి. ఈ చర్చి కథ విభిన్నంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటుంది. సాధారణంగా మనం పాత, అందమైన చర్చి లోపలికి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము. అక్కడి అందమైన నిర్మాణాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెబుతున్న చర్చిలో ఓ మృతదేహం వేలాడదీయబడింది.  అది కూడా దాదాపు 500 ఏళ్లుగా ఈ చర్చి పైకప్పునుండి ఆ మృతదేహం వేలాడుతూనే ఉంది. మీరు అదేదో మానవ మృతదేహం అనుకుని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..వేలాడుతుంది ఒక మొసలి కళేబరం. ఏది ఏమైనప్పటికీ చర్చిలో మృతదేహం వేలాడదీయడం మాత్రం విచిత్రమే. వివరాల్లోకి వెళితే..

ఇటలీలోని లొంబార్డీ ప్రాంతంలో శాంటూరియో డెల్లా బీటా వర్జిన్ మరియా డెల్లె గ్రాజీ అనే చర్చి ఉంది. ఈ చర్చిలో నిజమైన మొసలి మృతదేహం వేలాడుతోంది. మొసలి మృత దేహం శాంటూరియో డెల్లా బీటా వర్జిన్ మరియా డెల్లే గ్రేజీ చర్చికి ఎలా వచ్చిందనేది చాలా మందికి ఆసక్తిగా ఉండవచ్చు. కానీ అది ఎలా వచ్చిందో వివరాలు తెలియదు. ఇది మతపరమైన చిహ్నంగా నమ్ముతారు. అయితే, ఇక్కడి చర్చి పైన మీరు చూసే ఈ మొసలి బొమ్మ అనుకునేరు.. కాదు.. ఇది నిజమైన మొసలి. ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం వేయబడిందని చెబుతారు. ఈ చర్చి 13వ శతాబ్దానికి చెందినది.

Crocodile In The Church

ఈ మొసలి వెనుక అనేక కథనాలు, ఇతిహాసాలు అక్కడి చుట్టూ పక్కల ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో రెండు కథలు ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఇద్దరు సోదరులు ఫ్రాన్సిస్కో గొంజగాలోని ఒక ప్రైవేట్ జంతుప్రదర్శనశాల నుండి తప్పించుకున్న మొసలిని పట్టుకుని చంపినట్లు కొందరు నమ్ముతారు. మరికొంతమంది, మిన్సియో నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు సోదరులపై మొసలి దాడి చేసిందని, అయితే, వారు దైవానుగ్రహంతో మొసలిని చంపారని చెబుతారు. ఇలాంటి అనేక కథలు ఈ చర్చీ చుట్టుపక్కల బాగా ప్రచారంలో ఉన్నాయి. ఏది నిజం అనేది మాత్రం తెలియదు. కానీ, చర్చిలో ఈ మొసలి ఆకర్షణీయంగా ఉందనే వార్త మాత్రం వైరల్ గా మారింది. ప్రపంచ దేశాల ప్రజలు దీనిపై చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..