గాజాలో ఆగని మారణహోమం.. అన్నార్తులపై కాల్పులకు తెగబడ్డ ఇజ్రాయెల్ సైన్యం.. 93 మంది మృతి!

గాజాలో మారణహోమం కొనసాగుతోంది. ఆహారం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనా పౌరులపై రెండు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ బీకర దాడుల్లో సుమారు 93 మంది వరకు మరణించగా, వందల మంది గాయపడ్డట్టు గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. జికిం మీదుగా ఉత్తర గాజాలోకి ప్రవేశించే ఆహార ట్రక్కుల కోసం జనాలు పరుగులు తీయగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

గాజాలో ఆగని మారణహోమం.. అన్నార్తులపై కాల్పులకు తెగబడ్డ ఇజ్రాయెల్ సైన్యం.. 93 మంది మృతి!
Israeli Forces Killd Civili

Updated on: Jul 21, 2025 | 8:57 AM

గాజాలో గత కొన్ని రోజులుగా మారణహోమం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనియన్లను టార్గెట్‌గా చేసుకొని ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రెండు చోట్ల జరిగిన దాడుల్లో సుమారు 93 మందికిపై సామాన్య పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం పాలస్తీనా పౌరుల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరందరు మరణించారు. ఇజ్రాయెల్‌ భూభాగం నుంచి యుద్దంలో దెబ్బతిన్న పాలస్తీనాలోని జికిమ్‌ క్రాసింగ్‌ ద్వారా ఉత్తర గాజాలోకి ప్రవేశించిన వాహనాల కోసం స్థానిక పాలస్తీనా పౌరులు పరుగెత్తుకొని వస్తుండగా వారిపై ఇజ్రాయెల్‌ సైనికులు కాల్పులు జరిపినట్లు జాగా పౌర రక్షణ సంస్థ తెలిపింది.

ఈ దాడిలో సుమారు 80 మంది మరణించగా వందకు పైగా పౌరులు తీవ్రంగా గాపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారందరు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దక్షిణ గాజాలో జరిగిన మరో దాడిలో సుమారు ఆరుగురు పాలస్తీనా పౌరులు హతమయ్యారు. దక్షిణాన రఫాకు సమీపంలో ఉన్న సహాయ కేంద్రంలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారని ఏజెన్సీ ప్రతినిధి మహమూద్ బసల్ ఓ అంతర్జాతీయ మీకు తెలిపారు.

UN ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకారం.. ఆహార సహాయం తీసుకువెళుతున్న 25 ట్రక్కుల కాన్వాయ్ ఇజ్రాయెల్‌ నుంచి గాజా నగరానికి సమీపంలో రాగానే అక్కడ ఆహారం కోసం వేచి చూస్తున్న పాలస్తీన పౌరులు ఒక్కసారిగా ఆ వాహనాల వైపు పరుగులు తీశారు. దీంతో ఇజ్రాయెల్‌ సైన్యం వారిపై కాల్పులకు తెగబడింది. ఈ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్‌ సైన్యం తమకు ఎదురైన ముప్పును తొలగించుకోవడానికి హెచ్చరిక కాల్పులు జరినట్టు తెలిపింది. ఇలా ఆహారం కోసం ప్రయత్నించి మే చివరి నుండి జులై వరకు సుమారు 800 మంది వరకు మరణించినట్టు ఐక్యరాజ్యసమితి ఈ నెల ప్రారంభంలో తెలిపింది.

ఇదిలా ఉండగా సెంట్రల్‌ గాజాలో ఉన్న జానాలు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్‌ మిలటరీ హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య ఖతార్‌లో చర్చలు జరుపుతుండగా ఈ ఇజ్రాయెల్ సైన్యం ఈ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.